By: ABP Desam | Updated at : 23 Apr 2023 05:20 PM (IST)
Representational image/pixabay
వేసవి పండ్లు విరివిగా లభించే కాలం. ద్రాక్ష, మామిడి, పుచ్చ, కర్బూజ, దానిమ్మ, అనాస ఇలా రకరకాల పండ్లు అందుబాటులో ఉండే కాలం . ఎండల్లో చల్లని పుచ్చకాయ తినడంలో ఉండే హాయి చెప్పలేనిది. ఎక్కువ నీరుండే ఈ పండుతో ఆకలి మాత్రమే కాదు దాహం కూడా తీరుతుంది. మార్కెట్లో ఎలాంటి పుచ్చకాయను ఎంచుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. పుచ్చకాయ పూర్తిగా పండిపోయి లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం కొంచెం కష్టమే. కోసి చూస్తే కానీ అర్థం కాదు.
పుచ్చకాయ లోపల ఎర్రగా నీళ్లతో ఉన్నపుడే అది రుచిగా ఉంటుంది. ఇలాంటి పుచ్చకాయలోనే పోషకాలు కూడా ఉంటాయి. పుచ్చకాయ బాగా పండినపుడే అందులో లైకోపిన్ తో పాటు ఇంకా చాలా యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. పుచ్చకాయ మధుమేహులు తినగలిగే పండు. గుండె జబ్బులు, క్యాన్సర్లను నివారిస్తుంది కూడా. ఇన్ని సుగుణాలు కలిగిన సరైన పుచ్చ కాయ (పుచ్చ పండు) కోసి చూడకుండానే కనుగొనడం ఎలా?
పుచ్చకాయలు రకరకాల పరిమాణంలోనూ, ఆకారంలోనూ ఉంటాయి. కొన్ని గుండ్రగా ఉంటాయి. కొన్ని దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉన్నా కూడా పండు మొత్తం కూడా ఏకరీతిగా ఉండాలి. ఎక్కువ తక్కువలుగా ఉండకూడదు. ఒక నిర్థుష్ట ఆకారంలో ఉండే పుచ్చకాయే మంచిదని గుర్తించాలి.
బాగా పండిన పుచ్చకాయ బరువుగా ఉంటుంది. పరిమాణం కనిపించినంత మేర బరువు కూడా తూగాలి. బాగా పండి నీరు, గుజ్జు చేరి ఉన్న పండు బరువుగా ఉంటుంది. కాబట్టి బరువుగా ఉన్న పుచ్చకాయనే ఎంచుకోవాలి.
పుచ్చ కాయను కొనె ముందు చేతిలోకి తీసుకుని అన్ని వైపులా తిప్పి చూడాలి. అలా తిప్పి చూసినపుడు పసుపుపచ్చని మచ్చలు కనిపించాలి. వీటిని గ్రౌండ్ స్పాట్ అని పిలుస్తారు. ఇలాంటి మచ్చలు ఉన్నాయంటే అది తీగమీదే పండిన పండు అని, తియ్యగా ఉంటుందని అర్థం. కొన్ని పండ్ల మీద తెల్లని మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఇంకా సరిగ్గా పండలేదని అర్థం. దీని రుచి కూడా చప్పగా ఉంటుంది. జ్యూస్ కూడా తక్కువగా ఉంటుంది.
పండిన పుచ్చకాయను గుర్తించడానికి మరొక మార్గం పండు మీద తట్టి ధ్వని వినడం. అలా విన్నపుడు ధ్వని కొంచెం లోతుగా వినిపిస్తుంది. అంతేకాదు పండిన పుచ్చకాయ పైన తోలు కూడా పలుచగా ఉంటుంది.
పుచ్చకాయను ఎప్పుడైనా పూర్తి పండు కొనాలి. ముక్కలు చేసిన పుచ్చకాయ కొనకూడదు. కొంత మంది పుచ్చకాయను ఆర్టిఫిషియల్ గా పండేలా చెయ్యడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు చేస్తారు. అటువంటి రంధ్రాలు కనిపిస్తున్నాయేమో గమనించండి. ఇలాంటి పండ్లు కొనకపోవడమే మంచిది.
పుచ్చకాయ వాటర్ మిలన్ పేరుతో ప్రాచూర్యంలో ఉన్న ఇంగ్లీష్ పేరు. దీని పేరుకు తగ్గట్టుగా 91 శాతం నీరే ఉంటుంది. కాబట్టి ఈ పండు వేసవిలో తినడం చాలా మంచిది. కేలోరిలు కూడా తక్కువ ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఒకసారి తింటే కడుపు నిండుతుంది. దాహం తీరుతుంది. మంచి పోషకాలు శరీరానికి అందుతాయి.
Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే
Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో
Chai-Biscuit: ఛాయ్తో బిస్కెట్స్ కలిపి తీసుకుంటున్నారా? మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే
Air Conditioning: వేసవిలో ఏసీ లేకుండానే మీ రూమ్ ఇలా చల్లబరుచుకోవచ్చు
White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే
Modi Telangana Tour: మరోసారి తెలంగాణకు మోదీ, ఈసారి రోడ్ షోకి కూడా ప్లాన్!
Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్- రక్తంలా కనిపిస్తున్న నీళ్లు!
TTD News: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ, అట్టహాసంగా జరిగిన వేడుక
మనం అనుకుంటున్నట్టు ప్రభాస్ అలాంటి వాడు కాదు: కృతి సనన్