Tomatoes: వజ్రాల కన్నా విలువైన టమోటో విత్తనాలు, కిలో ఎన్ని కోట్ల రూపాయలంటే
టమోటా ధరలు పెరిగిపోయాయి. ఆ ధరలు చూసి కొనడమే మానేశాం.
దేశంలో టమోటో, పచ్చిమిర్చి ధరలు అమాంతం పెరిగాయి. కొన్నిచోట్ల కిలో టమోటో 400 రూపాయలు అమ్ముతున్నారు. ఆ ధరలు చూసే మనము అమ్మో అంటున్నాము. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టమోటో విత్తనాలు ఉన్నాయి. వాటి ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ టమోటో గింజలు కిలో కొనాలంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాలో తెలుసా? అక్షరాలా మూడు కోట్ల రూపాయలు. మూడు కోట్ల రూపాయలతో ఎంతో బంగారాన్ని, వజ్రాలను కొనుక్కోవచ్చు. కానీ వాటిని కాదని టమోటో గింజలను కొనేవారు ఉన్నారు. వారంతా బిలియనీర్లే. ఈ టమోటో విత్తనాలను బంగారం కంటే విలువైనవని చెప్పుకుంటారు. వీటిని ‘సమ్మర్ సన్’ అని పిలుస్తారు. యూరోపియన్ మార్కెట్లో ఇది అధికంగా లభిస్తాయి. కిలో ప్యాకెట్ ధర మూడు కోట్ల రూపాయలు. అంటే 5 కిలోల బంగారాన్ని కొనవచ్చు.
హెజెరా జెనెటిక్స్ సంస్థ ఈ విత్తనాలను అమ్ముతోంది. ఈ విత్తనాలు చాలా ఖరీదైనవి. దానికి కారణం కూడా ఉంది. ఈ టమోటో విత్తనాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విత్తనం కూడా ఖచ్చితంగా మొక్కగా మొలుస్తుంది. అది 20 కిలో గ్రాముల టమోటాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ విత్తనం ద్వారా పుట్టిన మొక్కకు కాసిన టమోటాలలో ఎలాంటి విత్తనాలు ఉండవు. ప్రతి పంటకు రైతులు కొత్త విత్తనాలను కొనుగోలు చేయాల్సిందే. అందుకే వీటి ధర ఆకాశాన్ని అంటింది.
వీటి రుచి కూడా చాలా అసాధారణంగా ఉంటుంది. అన్ని టమోటాలతో పోలిస్తే సమ్మర్ సన్ టమోటో విత్తనాలకు కాసిన టమోటోలు చాలా రుచిగా ఉంటాయి. తినే కొద్ది మళ్లీ తినాలనిపిస్తాయి. అందుకే అధిక ధర ఉన్నప్పటికీ ఈ టమోటో విత్తనాలను కొని పంటలు పండించే వాళ్ళు అధికంగానే ఉన్నారు. ఆ టమోటాలను కొనేది కూడా ధనవంతులే. ఈ టమాటో విత్తనాలను హెజెరా జెనెటిక్స్ ప్రత్యేకంగా ఉత్పత్తి చేసింది. కేవలం ఈ విత్తనాలను ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, నాణ్యత అన్నింటి పైన చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఈ విత్తనాలను కనిపెట్టే ప్రయాణంలో హెజెరా సంస్థ ఎన్నో ప్రయోగాలు చేసింది. కిలో మూడు కోట్ల రూపాయలు అయినప్పటికీ ఒక్క విత్తనం 20 కేజీల టమోటాలను ఇస్తుంది కాబట్టి, అంతకు మించి లాభం వీటితో వచ్చేస్తుందని చెబుతోంది ఈ సంస్థ.
Also read: ఆ నది నిండా బంగారమే, గుప్పెడు ఇసుకలోను ఎంతో కొంత బంగారం దొరికే ఛాన్స్
Also read: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆయుర్వేద మూలిక ఇదే, పిల్లలకు తినిపిస్తే చదువులో దూసుకెళ్తారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.