(Source: ECI/ABP News/ABP Majha)
Copper-T: గర్భం ధరించకుండా వేయించుకునే లూప్ ఎంత కాలం తరువాత మార్చాలి?
లూప్ విషయంలో చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి.
పెళ్లయిన జంటలు అప్పుడే పిల్లలు వద్దనుకున్నా, లేదా ఒక బిడ్డ పుట్టాకో రెండో కాన్పుకు గ్యాప్ పాటించాలన్నా సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులను పాటించాలి. అలాంటి మంచి గర్భనిరోధక పద్ధతి ‘ఐయూసీడీ’ (ఇంట్రాయూటెరిన్ కాంట్రాసెప్టివ్ డివైస్). దీన్నీ కాపర్ టి, లూప్ అని కూడా పిలుస్తారు. ఆంగ్ల అక్షరం టి ఆకారంలో ఇది ఉంటుంది. మహిళల కోసమే దీన్ని తయారు చేశారు. పిల్స్ వాడడంతో భావిస్తే లూప్ వేయించుకోవడమే చాలా ఉత్తమమైన పద్ధతిగా చెబుతున్నారు వైద్యులు.
ఎలా పనిచేస్తుంది?
ఆంగ్ల అక్షరం టి ఆకారంలో ఉండే ఈ పరికరం ప్లాస్టిక్ తో తయారవుతుంది. దానికి చివర రాగితీగ చుట్టి ఉంటుంది. దీన్ని గర్భాశయం ముఖ ద్వారం దగ్గర అమరుస్తారు. దీని ముఖ్యమైన పని అండం, వీర్యం కలవకుండా అడ్డుకోవడమే. ఫాలోపియన్ గొట్టాల నుంచి అండం విడుదలను చాలా ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలోకి చేరకుండా, చేరినా ఒక చోట అతుక్కోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఫలదీకరణ జరగదు. అంటే గర్భం రాదు. అంటే లైంగిక జీవితానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కనీసం ఒక వస్తువు లోపల ఉన్నట్టు కూడా అనిపించదు. అందుకే ఇది విజయవంతమైంది.
ఇబ్బందులుంటాయా?
నిజానికి లూప్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది ఇది పెట్టుకోకూడదని, కొందరికి పడదని అంటారు. పడకపోవడం అనేది ఉండదు. లూప్ సరైన స్థానంలో అమర్చకపోతేనే చిన్నచిన్న సమస్యలు వస్తాయి. అది పెట్టుకున్నాక బ్లీడింగ్ అధికం కావడం వంటివి సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదిస్తే వారు చెక్ చేస్తారు. లూప్ ధరించిన రెండు మూడు నెలలు చిన్న చిన్న సమస్యల ఉండొచ్చు. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. కొందరికి లూప్ పెట్టాక నొప్పి రావచ్చు. ఆ నొప్పి రెండు మూడు రోజులకు పోతుంది.
ఎన్ని రోజులకు మార్చాలి?
అది మీరు ఎంచుకున్న లూప్ ను బట్టి ఉంటుంది. కొన్ని మూడేళ్లకు మార్చేవి ఉంటాయి, మరికొన్ని అయిదేళ్లకు మార్చేవి ఉంటాయి. ఒక్కసారి ధరిస్తే మూడేళ్ల వరకు బిందాస్ గా ఉండొచ్చు. ఆ తరువాత మాత్రం కచ్చితంగా మార్పించుకోవాలి. ఒకవేళ మీకు పిల్లలు కావాలనిపిస్తే వైద్యురాలి దగ్గరకు వెళితే ఆమె లూప్ ను తీసేస్తారు. దీనికి ఎంత సమయం పట్టదు, రెండు నిమిషాలల పనైపోతుంది. అనస్తీషియా వంటివి అవసరం లేదు. అలాగే లూప్ ధరించేటప్పుడు కూడా చాలా అనస్తీషియా అవసరం పడదు. చాలా చిన్నగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి నిమిషంలో పోతుంది. అవాంఛిత గర్భాలను అడ్డుకునేందుకు ఉత్తమమైన పద్ధతి ఇది. పిల్స్ వాడడం వల్ల ఇతర ఆరోగ్యసమస్యలు రావచ్చు, అదే లూప్ అయితే ఏ సమస్యా రాదు.
Also read: తీవ్రంగా బాధపడుతున్నారా? ఎవరికీ చెప్పుకోలేరా? అయితే ఇలా చేయండి
Also read: మెదడులో కణితులుంటే మూత్రపరీక్షలో ఆ విషయం పసిగట్టేయచ్చు, కొత్త అధ్యయనం ఫలితం