Gastric Pain: గ్యాస్ సమస్య వేధిస్తోందా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
గ్యాస్ సమస్యతో బాధపడేవారి సంఖ్య తక్కువేమీ కాదు. మన చుట్టూ ఉన్న వారికి సగం మందికి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్టు అంచనా.
గ్యాసు నొప్పిని చాలా మంది గుండె నొప్పి అనుకుంటారు. ఆ నొప్పి అంతగా వేధిస్తుంది మరి. తిన్న వెంటనే కడుపుబ్బరంగా అనిపించడం, తేనుపులు రావడం, వికారంగా అనిపించడం ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్య లక్షణాలు. కొందరికి భోజనం చేసిన వెంటన మంట మొదలవుతుంది. తింటే గ్యాస్ సమస్య, తినకపోతే నీరసం... ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. అలాంటివారికి కొన్ని వంటింటి చిట్కాలు ఇవిగో...
1. అల్లం గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో సహకరిస్తుంది. అల్లం రసాన్ని రోజూ తాగితే చాలా మంచిది. అందులో కొంచెం తేనె కూడా కలుపుకుంటే మరీ మంచిది.
2. భోజనం అయ్యాక రెండు మూడు యాలకులను నోట్లో వేసుకుని కాసేపు నములుతూ ఆ జ్యూస్ ను మింగుతూ ఉండాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే సమస్య తగ్గుతుంది.
3. కొబ్బరి నీళ్లు కూడా గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెడతాయి. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
4. పుదీనా ఆకులను వేడి నీళ్లలో మరిగించి, వడకట్టి ఆ నీళ్లను తాగితే మంచి ఫలితం ఉంటుంది.
5. భోజనం తరువాత రెండు లవంగాలు నోట్లో పెట్టుకుని మెల్లగా నమిలి మింగాలి. ఆ రసం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.
6. అన్నింటికన్నా ముఖ్యంగా గ్యాస్ సమస్య ఉన్న వారు ఇంటి వంటకే పరిమితమవ్వండి. బయటి ఆహారాలు తినడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. ఖాళీ పొట్టతో ఎక్కువ కాలం ఉన్నా కూడా గ్యాస్ అధికంగా పుట్టుకొస్తుంది. అలాగే కారం, మసాలాలు ఉన్న పదార్థాలను కూడా తినడం మానేయాలి.
7. ఒత్తిడి, మానసిక ఆందోళన, యాంగ్జయిటీ వంటి వాటి వల్ల కూడా గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: డయాబెటిస్ ఉన్నవారు నారింజ పండ్లు తినకూడదా?
Read Also: పాలలో చిటికెడు పసుపు... దీని వేడి ముందు చలి మంట కూడా బలాదూర్
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also: పిల్లల్లో టైప్1 డయాబెటిస్... ఎలా గుర్తించాలి? ఏం చేయాలి?
Read Also: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి