Oranges: డయాబెటిస్ ఉన్నవారు నారింజ పండ్లు తినకూడదా?
నారింజపండ్లు గుట్టలుగా వచ్చే కాలం ఇదే. మరి డయాబెటిస్ ఉన్న వారు వీటిని తినవచ్చా?
చాలా మంది మధుమేహులకు ఓ సందేహం... తియ్యని నారింజ పండ్లు తింటే డయాబెటిస్ సమస్య పెరిగిపోతుందేమో అని. అందుకే ఒక పండు తినడానికి కూడా ఆలోచించి నాలుగైదు తొనలు తిని వదిలేస్తారు. కానీ న్యూట్రిషనిస్టులు చెప్పినదాని ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు ఏమాత్రం భయపడకుండా చక్కగా ఆరెంజ్ లు లాగించవచ్చు. రోజులో రెండు మూడు తిన్నా ఏంకాదు. అయితే జ్యూసులు చేసుకుని తాగేటప్పుడు మాత్రం కొంతమంది చక్కెర కలుపుకుంటారు. దీని వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగిపోయి ఆరోగ్యం చెడుతుంది. ఆరెంజ్ జ్యూస్లో నిమ్మరసం, తేనె, అల్లం రసం, పుదీన రసం కలుపుకుని తాగితే చాలా మంచిది.
నారింజ పండ్లలో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. అలాగే కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫోలేట్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మధుమేహం ఉన్న వారు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా క్రమబద్ధీకరిస్తాయి. అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా నారింజ పండ్లు మేలు చేస్తాయి.
రాత్రిపూట వద్దు
రోజులో ఎప్పుడు ఈ పండ్లను తిన్నా ఫర్వాలేదు కానీ, రాత్రి పడుకునే ముందు మాత్రం వద్దని అంటారు ఆరోగ్యనిపుణులు. రాత్రి పూట తినడం వల్ల చలువ చేసి జలుబు కలిగే అవకాశం ఉంది. ఆహారం సరిగా జీర్ణం కానివారికి ఆరెంజ్ పండ్ల వల్ల ఉపశమనం కలుగుతుంది. సుఖవిరేచనం అయ్యేలా చేస్తుంది.
శృంగార సమస్యకు చెక్
నారింజ పండ్లు చాలా శక్తివంతమైన ఆహారం. పురుషుల్లో కొన్నిరకాల శృంగార సమస్యలను దూరం చేస్తుంది. సంతాన సాఫల్యత అవకాశాలను పెంచుతుంది. కాబట్టి నారింజ పండ్లను రోజుకు రెండు మూడు తిన్నా మంచిదే.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: పాలలో చిటికెడు పసుపు... దీని వేడి ముందు చలి మంట కూడా బలాదూర్
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
Read Also: వారానికి రెండు సార్లు... బ్రేక్‌ఫాస్ట్‌లో కట్టెపొంగలి, చలికాలానికి పర్‌ఫెక్ట్ వంటకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి