World Earth Day 2024 : ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్.. 2040 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తిని 60 శాతం తగ్గించడమే ఎర్త్ డే ప్రధాన లక్ష్యం
World Earth Day Theme : గ్లోబర్ వార్మింగ్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. దీనిపై అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచ ధరత్రి దినోత్సవం జరుపుతున్నారు.
World Earth Day Theme is Planet vs Plastics : భూమి, ప్రకృతి, పర్యావరణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరత్రి దినోత్సవం(World Earth Day 2024) జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్లాస్టిక్‌ను అంతం చేయాలనే లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ థీమ్ ప్రధాన అజెండా ఏమిటి? అసలు ఈ వరల్డ్ ఎర్త్ డేని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారంటే..
యూఎస్‌కు చెందిన సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఎర్త్ డేని ప్రారంభించాడు. పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్‌డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1970లో యూఎస్‌లో దీనిని మొదటిసారి నిర్వహించారు. అప్పటినుంచి 192 దేశాలలో బిలియన్ కంటే ఎక్కువ మంది ఈ ఎర్త్ డే నిర్వహిస్తున్నారు. 2016లో ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 22వ తేదీన పారిస్ ఒప్పందానికి ఈ సంతకం చేసింది. దీనిని వాతావరణం, పర్యావరణ ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఒప్పందంగా పరిగణిస్తారు.
ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ థీమ్‌తో..
గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని ఆమోదించడానికి 196 దేశాల నాయకులు ఆ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ఒకచోట చేరారు. ఒప్పందం ప్రకారం ఈ దేశాలు గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలని భావిస్తున్నాయి. అయితే గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు 2025కి ముందు గరిష్ట స్థాయికి చేరుకోవాలి. 2030 నాటికి ఇవి 43 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సంవత్సరం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే గ్లోబల్ థీమ్‌తో ముందుకు వచ్చారు. ప్రపంచ ధరత్రి దినోత్సవంలో భాగంగా గూగుల్ కూడా తన డూడుల్‌ని మార్చింది. ప్రతి సంవత్సరం వివిధ రకాల డూడుల్స్‌తో ముందుకు వస్తోంది గూగుల్.
2022 నుంచి ఈ థీమ్‌ని ఫాలో అవుతున్నారు..
గ్లోబల్ వార్మింగ్‌కు ప్లాస్టిక్ ప్రధాన కారణమవుతున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి భూమిలో కలిసిపోకుండా.. ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తున్నాయని పెద్ద ఎత్తున వాదనలు రావడంతో ఈ వినియోగాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యాపారులు, ప్రభుత్వాలు, NGOలు కలిసి ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ముందుకు వెళ్లేలా చూస్తున్నారు. 2040 నాటికి 60 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. 20240 నాటికి ప్లాస్టిక్లు లేని, రాబోయే తరాలకు ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని.. అధికారిక ఎర్త్‌డే వెబ్సైట్లో రాసుకొచ్చారు. ఈ థీమ్‌ని 2022 నుంచి కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడంపై దృష్టిని సారిస్తున్నారు.
ప్లాస్టిక రహిత భూమే ప్రధాన లక్ష్యం
2040 నాటికి అన్నిరకాలుగా ప్లాస్టిక్ ఉత్పత్తిని 60 శాతం తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. మానవ, భూమి, పర్యావరణ పరిరక్షణ కోసం పాస్టిక్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. ఈ థీమ్‌పై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించేలా చేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను తొలగించడం, ప్లాస్టిక్ వాడకంపై నిషేదాన్ని విధించేలా చేయడం వంటి డిమాండ్స్ ఈ థీమ్‌లో ఉన్నాయి. రాబోయే తరాలు ప్లాస్టిక్ రహిత భూమిని అందించడమే ఎర్త్ డే ప్రధాన లక్ష్యం.
Also Read : అతని వయసు 61.. కానీ బయోలాజికల్ ఏజ్ 30ల్లోనే ఉంది.. అది ఎలా సాధ్యమైందంటే