Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
New Maruti Dzire: మారుతి సుజుకి ఇటీవలే లాంచ్ చేసిన కొత్త డిజైర్ సేల్స్ పరంగా దూసుకుపోతుంది. లాంచ్ అయిన నెల రోజుల్లోపే 30 వేలకు పైగా యూనిట్లు అమ్ముడు పోవడం విశేషం.
Maruti Dzire Bookings: కొత్త మారుతి డిజైర్ నవంబర్ 11వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ అయింది. లాంచ్‌కు ముందే క్రాష్ టెస్ట్‌లో ఈ కారు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. కంపెనీ కొత్త డిజైర్‌లో అనేక సెక్యూరిటీ ఫీచర్లను చేర్చింది. దీని కారణంగా ఈ కారు ఫైవ్ స్టార్ రేటింగ్‌ను పొందిన మొదటి మారుతి బ్రాండెడ్ కారుగా నిలిచింది. దీంతో డిజైర్‌కు మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారును విడుదల చేసి నెల కూడా గడవలేదు. కానీ బుకింగ్స్ మాత్రం 30 వేల సంఖ్యను దాటేశాయి.
మారుతి డిజైర్ బంపర్ బుకింగ్
మారుతి ప్రతిరోజూ కొత్త మోడల్ డిజైర్‌కు సంబంధించి 1000కి పైగా బుకింగ్స్ పొందుతోంది. మారుతి సుజుకి కూడా ఇప్పటి వరకు ఐదు వేలకు పైగా యూనిట్లను డెలివరీ చేసింది. ప్రస్తుతం ఈ మారుతి కారు వెయిటింగ్ పీరియడ్ దాదాపు మూడు నెలలకు చేరుకుంది. గత మోడల్‌తో పోలిస్తే దీనికి ప్రతిరోజూ దాదాపు డబుల్ బుకింగ్స్ జరుగుతున్నాయని మారుతి తెలిపింది.
Also Read: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!
మారుతి డిజైర్ ఫీచర్లు ఇవే...
మారుతి ఈ కారులోని వ్యక్తుల సేఫ్టీపై గరిష్ట శ్రద్ధ కనబరిచింది. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో పాటు ఈబీడీ కూడా ఉంది. ఈ కారు డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో వస్తుంది. కొత్త మారుతి డిజైర్‌లో 360 డిగ్రీ కెమెరాతో పాటు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. మారుతి కొత్త డిజైర్‌లో సింగిల్ పేన్ సన్‌రూఫ్ కూడా అందించింది. కారులో 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
కొత్త మారుతి డిజైర్ ధర ఎంత?
కొత్త మారుతి డిజైర్‌లో అనేక కొత్త ఫీచర్లను చేర్చారు. ఆ తర్వాత కూడా ఈ కారు ధర రూ.ఏడు లక్షల రేంజ్‌లోనే ఉంది. కొత్త డిజైర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుంచి మొదలు అవుతుంది. దాని టాప్ మోడల్ ధర రూ. 10.14 లక్షల వరకు ఉంది. ఈ మారుతి కారు 24.79 కిలోమీటర్ల నుంచి 25.71 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో మారుతి సుజుకి నంబర్ వన్ బ్రాండ్‌గా ఉంది. కానీ పంచ్, నెక్సాన్ వంటి కార్లతో టాటా కూడా గట్టి పోటీని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు డిజైర్ సక్సెస్ మారుతిని ఒక అడుగు ముందుకు వేయించింది.
Also Read: భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ - విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్!
Drive a car which perfectly suits your accomplishments and embodies a sense of confidence. Drive The Dazzling-New Dzire.
— Maruti Suzuki Arena (@MSArenaOfficial) December 5, 2024
BOOK NOW!#MarutiSuzukiArena #DazzlingNewDzire #BestAndBeyond pic.twitter.com/gdb7pMDs2l
Crafted to captivate with its sleep exteriors, and thoughtfully crafted to create a lasting impression. Drove The Dazzling-New Dzire.
— Maruti Suzuki Arena (@MSArenaOfficial) December 1, 2024
BOOK NOW!#MarutiSuzukiArena #DazzlingNewDzire #BestAndBeyond pic.twitter.com/djT1IH0K94