Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Jio Best Annual Plan: ప్రస్తుతం మనదేశంలో ఉన్న టెలికాం కంపెనీలు కొన్ని వార్షిక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ అందించే బెస్ట్ ప్లాన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Best Annual Prepaid Plans: 2024 సంవత్సరం ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు కూడా కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు చవకైన రీఛార్జ్‌ని చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే అటువంటి రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్లాన్లతో రీఛార్జ్‌లు చేసుకుంటే మీరు సంవత్సర కాలం పాటు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.
ఈ రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్నాయి. ఇవి వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు. వీటిని ఒక్కసారి కొనుగోలు చేస్తే ద్వారా మీరు సంవత్సరం మొత్తం రీఛార్జ్ చేసుకోవాల్సి అవసరం ఉండదన్న మాట. ఈ రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సంవత్సరం వాలిడిటీని అందించే జియో రీఛార్జ్ ప్లాన్లు
రిలయన్స్ జియో 336, 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. 336 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ. 895గా ఉంది. ఈ ప్లాన్‌తో మొత్తం 24 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 50 ఎస్ఎంఎస్, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంది.
జియో అందిస్తున్న మరో వార్షిక ప్లాన్ ధర రూ. 3,599. ఇది ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో జియో యాప్స్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
ఎయిర్‌టెల్, వీఐ 365 రోజుల ప్లాన్
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ 365 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌లను అందిస్తున్నాయి. సంవత్సరం వ్యాలిడిటీతో రెండు నెట్‌వర్క్‌లూ అందిస్తున్న చవకైన ప్లాన్ ధర రూ. 1,999గా ఉంది. ఈ ప్లాన్‌తో 24 జీబీ హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాన్ని అందిస్తాయి.
బీఎస్ఎన్ఎల్ వార్షిక రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 365 రోజుల ప్లాన్ రూ. 2,999కి వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రతి రోజూ 3 జీబీ హైస్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు మీరు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను కూడా పొందుతారు.
Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Jio brings the unlimited possibilities of True 5G to Kerala’s tribal heartlands, because every dream deserves a chance to grow.#Kerala #TribalVillages #KeralaOnJio #OnJio #JioTrue5G pic.twitter.com/1Iw42Il1Aw
— Reliance Jio (@reliancejio) December 4, 2024
We are thrilled to introduce our AI powered Spam SMS Identification solution — designed to keep your messaging experience safe and clutter-free. With spam messages, which are often used as a gateway to frauds, on the rise, Vi’s Spam SMS solution will safeguard customers by…
— Vi_News (@ViNewsOfficial) December 2, 2024