అన్వేషించండి

Winter Care : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?

వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకుంటే అవి మీ దరిచేరవు అంటున్నారు నిపుణులు.

సీజన్ మారుతుంది. చలికాలం దాదాపు వచ్చేసింది. ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన శరీరం కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. ఆ సమయంలో రోగనిరోధక శక్తి లేకుంటే జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. అసలే ఈ ఏడాది ఎండలు అల్లాడించాయి. నవంబర్ నెల దాదాపు వచ్చేసినా.. మధ్యాహ్నవేళ బయటకు వెళ్లాలంటే భయం పుట్టించేలా సూరీడు విజృంభిస్తున్నాడు. కానీ ఉదయం, సాయంత్రం మాత్రం ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చాయి. చలి ప్రారంభమైంది. 

వాతావరణంలో మార్పులకు శరీరం తట్టుకోవాలంటే రోగనిరోధక శక్తి అవసరం. ముఖ్యంగా చలికాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా విజృంభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో రోగనిరోధకశక్తి పెంచుకోవడంపై మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఈ సీజన్​లో వచ్చే ప్రతి మార్పుతో వైరల్ ఇన్​ఫెక్షన్లు చాలా సులువుగా వ్యాపిస్తాయి. అంతేకాకుండా మనలోని రెసిస్టెన్సీ పవర్​ కూడా తగ్గుతుంది. తద్వార జలుబు, ఫీవర్ వంటివి ఎటాక్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల.. రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండొచ్చు. సీజనల్​ వ్యాధులను దూరంగా ఉంచే ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు 

పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది. ఇది సీజనల్ వ్యాధులను, అలర్జీలను నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఆరోగ్యకరమైన మసాలా దినుసు అంటారు. ఇది శక్తివంతమైన యాంటీ వైరల్​, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో నిండి ఉండి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

పసుపులోని కర్కుమిన్ తీవ్రమైన ఇన్ఫెక్షన్​లకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. దీనిని ప్రతి వంటలో కలిపి తీసుకోవచ్చు. మెరుగైన ఫలితాల కోసం పాలతో కలిపి రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. 

బ్లాక్ పెప్పర్

మిరియాలు బలమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లు దరి చేరనీయకుండా దూరంగా ఉంచుతాయి. ఒకవేళ మీరు ఇప్పటికే ఇన్ఫెక్షన్​ బారిన పడితే దానిని దూరం చేస్తాయి. సూక్ష్మజీవులు మీ శరీరంలోకి చేరకుండా రక్షిస్తాయి. 

అంతేకాకుండా ఇవి సీజన్ మారే వేళల్లో వచ్చే జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం అందిస్తాయి. అందుకే చాలామంది ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు మిరియాలతో చేసిన పాలు తాగుతూ ఉంటారు.  దీనిలోని పోషకాలు తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి.  

కొబ్బరి నీరు..

కొబ్బరినీళ్లల్లో సహజంగానే ఎలక్ట్రోలైట్​లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇన్​ఫెక్షన్లతో పోరాడటానికి సహాయం చేస్తాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నిండుగా ఉంటాయి. ఇవి సీజనల్ వ్యాధులు రాకుండా శరీరానికి రక్షణగా ఉంటాయి. 

కొబ్బరి నీళ్లలో లారిక్ యాసిడ్ కూడా నిండుగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపిస్తుంది. ఒకవేళ సీజనల్ వ్యాధులు ఇప్పటికే ఎటాక్​ అయినా.. మీరు కొబ్బరి నీరు తాగడం వల్ల ఇన్​ఫెక్షన్​ను దూరం చేసుకోవచ్చు. పైగా దీనిలో కెలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇవి బరువును సమతుల్యం చేయడంలో సహాయం చేస్తాయి. 

సీజనల్ ఫ్రూట్స్

ఏ సీజన్​లో అయినా.. ఆ సమయానికి చెందిన ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. అవి సీజన్​కు అనుగుణంగా సీజన్ ప్రేరిత ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ సమయంలో మీరు సిట్రస్​ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 

నారింజ, ద్రాక్ష, కివీస్, యాపిల్స్, బ్లూబెర్రీలు హ్యాపీగా తినొచ్చు. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రుచికరమైన పండ్లు విటమిన్ సి కలిగి ఉండి.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. లోపల నుంచి మిమ్మల్ని బలోపేతం చేస్తాయి. కాబట్టి వాటిని మీరు నేరుగా తినొచ్చు. లేదా ఇంట్లోనే జ్యూస్ చేసుకుని తాగొచ్చు. 

స్ప్రౌట్స్​

మొలకలు మీ రోగనిరోధక శక్తిని పెంచే అనేక విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, మాంగనీస్, విటమిన్ కె వరకు మీరు చాలా ప్రయోజనాలు వీటి ద్వారా పొందవచ్చు. కాబట్టి వీటిని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తినొచ్చు. 

లేదంటే స్ట్రౌట్స్​కి టమోటాలు, ఉల్లిపాయలు, కీరదోస వంటి తాజా కూరగాయలను కలిపి కూడా తీసుకోవచ్చు. ఇవి మీకు మరింత పోషకాలు అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ మొత్తం శరీరానికి రక్షణ ఇస్తాయి. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపేస్తాయి. 

Also Read : గ్రీన్​ టీ తాగండి మంచిదే కానీ.. ఆ సమయంలో మాత్రం వద్దు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Embed widget