Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు
మార్కెట్లో అనేక రకాల టీలు అందుబాటులో ఉంటాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, మిల్క్ టీ ఇలా అనేక రకాల టీలు చూస్తూనే ఉంటున్నాం. ఎప్పుడు ఇవే తాగి తాగి బోర్ కొడుతుందా? అయితే ఈసారి కొత్తగా ఈ హెర్బల్ టీని రుచి చూడండి
మార్కెట్లో అనేక రకాల టీలు అందుబాటులో ఉంటాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, మిల్క్ టీ ఇలా అనేక రకాల టీలు చూస్తూనే ఉంటున్నాం. ఎప్పుడు ఇవే తాగి తాగి బోర్ కొడుతుందా? అయితే ఈసారి కొత్తగా ఈ హెర్బల్ టీని రుచి చూడండి. సాధారణంగా హెర్బల్ టీ అనేక ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక దాల్చిన చెక్కతో హెర్బల్ టీ తయారు చేసుకుని తాగి చూడండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇది అందిస్తుంది. దాల్చిన చెక్క మసాలా కూరల్లో వేసుకుంటాం. కానీ టీ ఏంటబ్బా? అని అనుకుంటున్నారా? కానీ దీనితో తయారు చేసిన టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అంతే కాదండోయ్, మధుమేహులకి ఇది చక్కటి ఔషధం లాంటిది. దాల్చిన చెక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో అనేక పోషకాలు కూడా ఉన్నాయి.
కావాల్సిన పదార్థాలు
దాల్చిన చెక్క ముక్కలు- 1 టేబుల్ స్పూన్
నీరు - రెండు కప్పులు
తేనె - కొద్దిగా
తయారీ విధానం
స్టవ్ మీద గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకోవాలి. అందులో దాల్చిన చెక్క ముక్కలు వేసుకుని 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. మంచి సువాసన వస్తున్నపుడు ఆ నీటిని వడకట్టి కప్పులోకి తీసుకోవాలి. కొద్దిగా ఘాటుగా ఉండటం వల్ల తాగలేని వాళ్ళు కొంచెం తేనె లేదా నిమ్మకాయ జోడించుకోవచ్చు. ఇదే కాదు మరో పద్ధతిలో కూడా ఈ టీ తయారు చేసుకోవచ్చు. బాగా మరిగిన నీటిని ఒక కప్పులోకి తీసుకుని అందులో దాల్చిన చెక్క బెరడు ఒక ముక్క, హెర్బల్ టీ బ్యాగ్ ఒకటి వేసి కొద్దిసేపు ఉంచాలి. అవి రెండు నీటిలో కలిసిన తర్వాత వాటిని తీసేసి ఆ టీ కూడా తాగవచ్చు.
దాల్చిన చెక్క టీ ప్రయోజనాలు
❄ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, గుండె సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ దాల్చిన చెక్కతోటయారు చేసిన టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
❄ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాదు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుంది.
❄ బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది. అయితే దాల్చిన చెక్క టీని మోతాదుకు మించి తీసుకుంటే దుష్ప్రభావాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కొద్ది మొత్తంలో మాత్రమే ఈ టీని తీసుకోవాలి.
❄ వృద్ధాప్య ఛాయలని ఇది తగ్గిస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీని వల్ల చర్మంలో ముడతలు రాకుండా ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ఇది ఇస్తుంది.
❄ గుండె జబ్బులను తగ్గిస్తుంది. రక్తంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ
Also Read: మెరిసే అందం మీ సొంతం కావాలా? ఈ ఆహారాన్ని అస్సలు మిస్ కావద్దు!