అన్వేషించండి

Lemon Alternatives: నిమ్మకాయ ధర పెరిగిందిగా, దాని బదులు ఇవి తినండి, ఎంతో ఆరోగ్యం కూడా

నిమ్మకాయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుకే చాలా మంది కొనడం మానేశారు.

వేసవి వచ్చిందంటే చాలు, కొన్ని ఉత్పత్తుల ధరలు కొండెక్కి కూర్చుకుంటాయి. ఇప్పుడు నిమ్మకాయల వంతు వచ్చింది. వాటి ధరలు చూస్తే మామూలుగా లేవు. పేదల సంగతి పక్కన పెడితే ఎగువ మధ్య తరగతి వాళ్లు కూడా కొనలేని పరిస్థితి. చిన్న నిమ్మకాయ ధర పది నుంచి 15 రూపాయల దాకా ఉంది. విటమిన్ సికి కేరాఫ్ అడ్రెస్ నిమ్మను కొనలేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. విటమిన్ సి కోసం, ఆ పులుపు కోసం కేవలం నిమ్మకాయే తినక్కర్లేదు. దాని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. 

ఉసిరికాయలు
ఉసిరి కాయలు తిన్నా కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. రోజుకో ఉసిరికాయ తిన్నా చాలు, కావాల్సినంత విటమిన్ సి శరీరంలో చేరుతుంది. ప్రతి పండు 600 నుంచి 700మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది విటమిన్ సి పవర్ హౌస్ అని చెప్పచ్చు. 

పుల్ల మామిడి
మామిడి కాయలు విరివిగా దొరికే కాలం ఇది. నిమ్మకాయ పులిహోర చేసినట్టు మామిడి తురుముతో కూడా పులిహోర చేసుకోవచ్చు. పుల్లపుల్లగా భలే రుచిగా ఉంటుంది. నిమ్మకాయల పులిహోరను మరిపించేస్తుంది. దీనిలో కూడా విటమిన్ సి దొరుకుతుంది. 

బొప్పాయి
అందరికీ అందుబాటు ధరలో ఉండే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. మహిళలకు ఇవి చాలా మంచివి. పీరియడ్స్ ను క్రమబద్ధీకరించడంలో ఇవి ముందుంటాయి. ఫైబర్, పొటాషియం, సోడియం అధికంగా లభిస్తాయి. వందగ్రాములు బొప్పాయి ముక్కలు తింటే 60.9మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. 

నారింజలు
ఇవి కూడా నిమ్మజాతి పండ్లే. ప్రతి పండులో 53 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. తాజా నారింజ రసం చాలా టేస్టీగా ఉంటుంది కూడా. పిల్లలకు పెడితే చాలా మంచిది. నిమ్మ కన్నా ఇప్పుడు నారింజలే తక్కువ ధరలు పలుకుతున్నాయి. 

టమాటోలు 
కూరల్లో నిమ్మ అవసరం తక్కువనే చెప్పాలి. టమాటోలు ఉండగా నిమ్మతో పెద్ద అవసరం ఉండదు. కాకపోతే విటమిన్ సి కోసం టమాటలో కూరలను తిన్నా చాలు. శరీరానికి సరిపడా దొరుకుతుంది. 

జామకాయలు, స్రాబెర్రీలు, క్యాప్సికం వంటి వాటిలో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మకాయ ధరలు తగ్గేవరకు వీటితో సర్దుకు పోవాల్సిందే.  నిజానికి నిమ్మకాయకు మించి అధిక పోషకాలు వీటిలోనే అందుతాయి.

Also read: గర్భం ధరించకుండా వేయించుకునే లూప్ ఎంత కాలం తరువాత మార్చాలి?

Also read: తీవ్రంగా బాధపడుతున్నారా? ఎవరికీ చెప్పుకోలేరా? అయితే ఇలా చేయండి

టాప్ హెడ్ లైన్స్

Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Halim Seeds : హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
హలీమ్ సీడ్స్​ ఎలా తీసుకుంటే మంచిది? ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇవే
Running After 40 : 40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
40 ఏళ్లు దాటాక రన్నింగ్ చేయొచ్చా? కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న డాక్టర్
Spicy Egg Masala Curry : ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే
ఎగ్ మసాలా కర్రీ ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. రోటీ, అన్నంలోకి సూపర్ కాంబినేషన్.. రెసిపీ ఇదే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget