చర్మం మీద దద్దుర్లా? ఈ ఆయుర్వేద చిట్కాలు ఒకసారి ట్రై చేసి చూడండి
రకరకాల కారణాలతో చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. కొన్ని సార్లు దురద, మంట కూడా ఉంటుంది. చర్మ సమస్యలకు మందుల కంటే కూడా ఇంటి వైద్యాలు, ఆయుర్వేద సలహాలే మంచి ఫలితాలను ఇస్తాయి.
ఆయుర్వేదం అత్యంత పురాతనమైన వైద్య విధానం. ఇందులో రకరకాల ఆరోగ్య సమస్యలకు సహజమైన చికిత్సలు, నివారణ విధానాలు వివరించారు. చర్మ సమస్యలకు కూడా మంచి పరిష్కారాలు సూచించింది. చలి కాలంలో చర్మం పొడి బారడం వల్ల చర్మ సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. అలర్జీ ప్రోన్ శరీరతత్వం కలిగిన వారిలో అది మరింత ఎక్కువ. చర్మ సమస్యలకు మందుల కంటే కూడా ఇంటి వైద్యాలు, ఆయుర్వేద చికిత్సలే మంచి ఫలితాలను ఇస్తాయి.
చర్మంపై దద్దుర్లు రావడానికి అనేక కారణాలుంటాయి. కొన్ని సార్లు దురద, మంట కూడా ఉంటుంది. గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా లేదా స్పర్శ ద్వారా రకరకాల పదార్థాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి పట్ల శరీరం నెగెటివ్ గా రియాక్ట్ అయితే.. దాన్ని అలర్జీ అంటారు. కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి వివిధ రకాల అలెర్జీలకు ఏ విధంగా కారణం అవుతాయో డాక్టర్ డింపుల్ జగ్దా అనే ఆయుర్వేద నిపుణురాలు తన పోస్ట్ లో వివరించారు. అలెర్జీ కారణంతో చర్మంపై దద్దుర్లు వస్తాయి. కొంత మందిలో వాతావరణ మార్పులు కూడా అలెర్జీలకు కారణం అవుతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు చర్మం మీద దద్దుర్లకు కారణం అవుతాయి.
చర్మం మీద ఏర్పడిన దద్దుర్ల చికిత్సకు ఆయుర్వేదంలో రకరకాల తైలాలు అందుబాటులో ఉన్నాయి. బాదాం, చమోమిలే, టీట్రీ వంటి రకరకాల నూనెలు వీటి చికిత్సకు ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వాడే దాదాపు అన్ని ఉపాయాలు కూడా సహజమైనవే కావడం వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఓట్మీల్ బాత్
ఓట్మీల్ చక్కటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇందులోని ఒలేయిక్ ఆసిడ్, లినోయిక్ ఆసిడ్ చర్మాన్ని రిపేర్ చేస్తాయి. మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. చర్మం ఎర్రబారడాన్ని, దురద, నొప్పిని తగ్గిస్తాయి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె చర్మం మంటను తగ్గిస్తుంది. దద్దుర్లు, ఎరుపు, దురద నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు ఇది శరీరంలోకి అలర్జీ కారకాలను చేరకుండా నిరోధిస్తుంది కూడా. అంతేకాదు చర్మం హైడ్రేటెడ్ గా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. అంతేకాదు ఇన్ఫ్లమేషన్ ను కూడా నివారిస్తుంది.
కలబంద
తాజా కలబంద యాంటీ ఇన్ప్లమేటరీగా పనిచేస్తుంది. అంతే కాదు ఇది యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ కూడా. యాంటీ ఆక్సిడెంట్లు కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇది రకరకాల విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లతో ఉంటుంది. చర్మం మీద దద్దుర్లు, ఇరిటేషన్ ను తగ్గిస్తుంది. ఆలోవేరా జెల్‌ను నేరుగా దద్దుర్లపై రాసుకోవచ్చు.
దద్దుర్లు తగ్గించేందుకు ఆయుర్వేదంలో రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి పైన లేపనాలు రాసుకోవడం అయితే రెండోది ఉఫ్పు, కారం, పుల్లని, పులియ బెట్టిన పదార్థాలు, వేపుళ్లు తినడం తగ్గించాలి. టీ, కాఫీలు, తీపి ఎక్కువ ఉండే డ్రింక్స్, ఆల్కహాల్ తగ్గించి తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాదు చర్మం పొడిబారకుండా చూసుకోవడం, తగినంత నీళ్లు తాగడం, వీలైనంత వరకు సహజమైన పదార్థాలనే చర్మ లేపనాలుగా వాడడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Also read: చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మార్గాలు ఇవే