Weight Loss Tips : రాత్రుళ్లు ఈ టిప్స్ ఫాలో అయితే బరువు ఈజీగా తగ్గుతారట.. అవేంటంటే
Dinner Tips : రాత్రి భోజనంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో.. ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం.
Healthy dinner tips for weight loss : డిన్నర్ సమయంలో చేసే మిస్టేక్స్ వల్లే చాలామంది బరువు పెరుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు. తెలియక చేసే పొరపాట్ల వల్ల బరువు తగ్గడం కాదు పెరిగిపోతున్నారట. డిన్నర్ సమయంలో కొన్ని కరెక్షన్స్ చేస్తే బరువు తగ్గడంతో పాటు.. హెల్తీగా ఉండొచ్చని చెప్తున్నారు. ఇంతకీ డిన్నర్ విషయంలో ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి? డిన్నర్ ఏ సమయానికి ముగిస్తే మంచిది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ తినడం..
చాలామంది ఆఫీస్ అయిపోయింది కదా.. డిన్నర్ ఫుల్‌గా లాగిద్దామనుకుంటారు. ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అయితే డిన్నర్ ఎప్పుడు తక్కువగానే తీసుకోవాలంటున్నారు నిపుణులు. మధ్యాహ్నం తినే దానికంటే రాత్రి భోజనం తక్కువగానే ఉండాలట. కాబట్టి రాత్రుళ్లు ఎంత తింటున్నారో తెలుసుకోండి.
సమతుల్య ఆహారం..
డిన్నర్గా తీసుకునే ఆహారంలో.. ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. చేపలు, చికెన్, టోఫు వంటివి చేర్చుకోవాలి. కూరగాయలను కూడా డైట్లో భాగం చేసుకోవాలి. బ్రౌన్ రైస్, క్వినోవా, గోధుమ బ్రెడ్ వంటి వాటిని మీ డిన్నర్లో తీసుకోవచ్చు.
ఇలా వండుకోవాలి..
చికెన్, చేపలు చెప్పారు కదా అని వాటిని మసాలాలు, స్పైసీగా చేసుకుంటే బరువు తగ్గడం కాదు.. పెరుగుతారట. హెల్తీగా తీసుకోవడానికి.. గ్రిల్ చేయడం లేదా బేకింగ్ చేయడం చేయాలి. డీప్ ఫ్రై చేయకూడదు. వాటి రుచిని పెంచుకునేందుకు సాల్ట్, షుగర్స్ కాకుండా హెర్బల్స్ని వినియోగిస్తే మంచి రుచి వస్తుందంటున్నారు. ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్‌తో వండుకుంటే ఆరోగ్యానికి మరీ మంచిదని చెప్తున్నారు.
రాత్రి భోజన సమయం
వీలైనంత త్వరగా డిన్నర్‌ని ముగించాలని చెప్తున్నారు నిపుణులు. నిద్రపోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందే తినేయాలని సూచిస్తున్నారు. మరికొందరు సూర్యస్తమయం తర్వాత తినరు. ఇలా చేయడం కూడా మంచిదేనని చెప్తున్నారు. రాత్రుళ్లు ఆలస్యంగా తినడం, స్నాక్స్ లాంటివి లాగించడం వల్ల బరువు ఇట్టే పెరిగిపోతారని హెచ్చరిస్తున్నారు.
హైడ్రేషన్..
హైడ్రేటెడ్‌గా ఉండడం వల్ల బరువు తగ్గుతారట. అలాగే డిన్నర్ తర్వాత కాకుండా.. భోజనం చేసే ముందే నీటిని తాగడం వల్ల తక్కువగా తింటారని.. దీనివల్ల బరువు తగ్గే అవకాశముంటుందని చెప్తున్నారు. అలాగే కంగారుగా కాకుండా.. ఫుడ్‌ని బాగా నమిలితే త్వరగా జీర్ణమై.. ఆరోగ్య సమస్యలు రావని సూచిస్తున్నారు.
డైట్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు..
గ్రిల్డ్ చికెన్.. రోస్ట్ చేసుకున్న కూరగాయాలు, క్వినోవాను డిన్నర్గా తీసుకోవచ్చు. చేపను బేక్ చేసి.. బ్రౌన్ రైస్‌ని, ఉడికించిన బ్రకోలీతో కలిపి తీసుకోవచ్చు. ఆకుకూరలు, కూరగాయలతో సూప్ పెట్టుకుని.. బ్రెడ్‌తో, సలాడ్‌తో డిన్నర్‌ని ముగించవచ్చు.
బరువు తగ్గాలంటే చాలా ఓపిక అవసరం. ఒక్కరోజు ఫాలో అయ్యి బరువు తగ్గిపోవాలంటే అసాధ్యం. కాబట్టి రెగ్యూలర్‌గా ఈ టిప్స్ ఫాలో అవుతూ.. రోజూ వ్యాయామం చేస్తూ, యాక్టివ్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతారు.
Also Read : డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటే జరిగే నష్టాలు ఇవే.. రోజుకు ఎన్ని తినవచ్చంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.