(Source: ECI/ABP News/ABP Majha)
షుగర్ క్రేవింగ్స్ - పదే పదే తీపి తినాలనిపిస్తోందా? ఇవి ప్రయత్నించండి, డయాబెటిస్ సమస్య ఉండదు!
మంగకు మొన్న ఈ మధ్యే షుగర్ వచ్చింది. తిపి తినకూడదు. కానీ ఆమెకు అది కష్టం. శాలిని బరువు తగ్గేందుకు డైట్‌లో ఉంది. వారిని షుగర్ క్రేవింగ్స్ ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి వారి కోసమే ఈ సమాచారం.
ప్రస్తుత కాలంలో అత్యంత చెడ్డ పేరు మోస్తున్న ఆహార పదార్థాలలో ఒకటి చక్కెర. డైట్ గురించి ఆలోచించే వారు ముందుగా మానేసేది అదే. కానీ అంత త్వరగా వదిలే రుచి కాదు ఇది. పదే పదే మనసులో మెదిలి అటువైపు మనసు లాగే మధురం. అయితే దాని నుంచి ఎలాగూ తప్పించుకోలేం. అటువంటప్పుడు తినే తీపి కాస్త ఆరోగ్యదాయకంగా ఉండటం మంచిదని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.
ఆరోగ్యంగా ఉండాలనో, బరువు తగ్గాలనో అనుకునే వారు డైటింగ్ చేద్దాం అనుకుంటారు. అలా డైట్ లో ఉన్నపుడు షుగర్ ఇన్ టేక్ తగ్గిస్తారు. కానీ ఇలా తగ్గించినపుడు శరీరం షుగర్ తినాలనే ఆశను పుట్టిస్తుంది. దాన్నే షుగర్ క్రేవింగ్స్ అంటారు. డైట్ చేస్తూ ఆరోగ్యానికి హాని చెయ్యని షుగర్ కొద్ది మొత్తంలో తీసుకుంటే ఇటువంటి స్థితిని ఎదుర్కోవడం సులభం అవుతుంది. అదనంగా తీసుకునే షుగర్ శరీరానికి అదనంగా క్యాలరీలు శరీరంలో చేరుస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. అది టైప్ 2 డయాబెటిస్ కు కారణం కావచ్చు. అయితే పూర్తి స్థాయిలో అన్ని తీపి పదార్థాలను దూరంగా ఉంచలేం. అందువల్ల ఆరోగ్యాన్ని పాడుచేయని చక్కెరకు ప్రత్యామ్నాయంగా మూడు పదార్థాలను సూచిస్తున్నారు.
రెసిన్స్ (ఎండుద్రాక్ష)
ఎండుద్రాక్ష చాలా రుచికరమైన ఫలాలు. సహజమైన తిపి పదార్థం. కొద్ది మొత్తంలో తీసుకుంటే షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఎండు ద్రాక్ష తీసుకుంటే వచ్చే ఆరోగ్య లాభాలు చాలా ఎక్కువ. మలబద్దకం నుంచి విముక్తి దొరుకుతుంది. శక్తి లభిస్తుంది. క్యాల్షియం ఎక్కువ అందడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులోని ఐరన్ వల్ల రక్త వృద్ధి జరుగుుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.
ఖర్జురాలు
ఖర్జురాలు చాలా బలవర్ధమైన ఆహారం. పిత్త దోషం నిర్మూలిస్తుంది. కండరాలు పుష్టిగా తయారవుతాయి. మెదడు పని తీరు మెరుగవుతుంది. షుగర్ క్రేవింగ్ అనిపించినపుడు ఖర్జురాలు తీసుకోవచ్చు. జీర్ణ సంబంధ ఇబ్బందులేమైనా ఉంటే నీటిలో నానాబెట్టిన ఖర్జురాలు తీసుకుంటే మంచిది. ప్రతి రోజు ఖర్జురాలు తీసుకునే వారు త్వరగా ఆరోగ్యాన్ని సంతరించుకుని పుష్టిగా తయారవుతారు.
తేనె
తేనె మంచి ఫ్యాట్ బర్నర్. మంచి ప్యూర్ తేనె తీసుకునే అవకాశం ఉంటే చాలారకాలుగా తీసుకోవచ్చు. పొద్దున్నే వేడి నీటితో తీసుకుంటే బరువు తగ్గుతారు, చల్లని నీటితో తీసుకుంటే బరువు పెరగవచ్చు. నిమ్మకాయతో తీసుకుంటే నిరోధక శక్తి పెరుగుతుంది. తక్కువ మోతాదులో డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు. తేనె అంటే సహజమైన ప్రొటీన్. దీన్ని తీసుకోవడం కండరాల పుష్టికి కూడా మంచిది.
ప్రోటీన్లు, కొవ్వులు లేకుండా సింపుల్ కార్బోహైడ్రేట్లు తీసుకున్నా కూడా త్వరగా ఆకలి తీరి శరీరం తిరిగి శక్తి పుంజుకుంటుంది. కొద్ది కాలం పాటు ఈ షుగర్ క్రేవింగ్స్ ని మేనేజ్ చెయ్య గలిగితే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదు. కొద్ది రోజుల పాటు ఆరోగ్యవంతమైన తిపి తినడం వల్ల ఇవ్వన్నీ సాధ్యమవుతాయి.