![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sunflower Seeds: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు
సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ మంది ఇళ్లల్లో వంట నూనెగా వాడుతూనే ఉంటారు. కానీ వాటి గింజలు మాత్రం తినరు. తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
![Sunflower Seeds: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు Health Benefits of Sunflower Seeds Sunflower Seeds: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/02/b96f7f5ba560646d55930af4a58b4182_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మంచి ఆహారం అంటే కేవలం శక్తినిచ్చేవే కాదు, అనారోగ్యాలను రాకుండా అడ్డుకునేవి కూడా. ఈ రెండు పనులను సమర్థవంతంగా చేయగలవు ప్రొద్దు తిరుగుడు పూల గింజలు. ఇప్పుడివే తాజా ఫుడ్ ట్రెండ్. వీటిని తినడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు చాలా మంది ప్రజలు. పోషకాహార నిపుణులు కూడా వీటిని తినమనే చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన చాలా విటమిన్లు అందుతాయి. అలాగే అనేక అనారోగ్యసమస్యలకు ఈ గింజల్లోని పోషకాలు చెక్ పెడతాయి.
1. గుండె ఆరోగ్యానికి....
ఈ నల్లటి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. అంతేకాదు వీటిలో ఫ్లేవనాయిడ్లు, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. వీటి వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు దరిచేరవు.
2. క్యాన్సర్లకు చెక్
ఈ గింజలు క్యాన్సర్లను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో విటమిన్ ఇ, సెలెనియం, కాపర్ లభిస్తాయి. ఇవి శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఈ గింజలు తరచూ తినేవాళ్లలో రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా ఉంటాయి.
3. హార్మోన్లను సరిచేస్తాయి
మహిళ్లలో అధికంగా హార్మోన్ల అసమతుల్యత కనిపిస్తుంది. వీరిలో ఈస్ట్రీజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యంలో లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. అందుకే మహిళలు రోజూ కనీసం నాలుగుగింజలైనా తింటే మంచిది. హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయివి. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి. గర్భిణులు వీటిని తింటే ఎంతో మేలు.
4. మలబద్దకం ఉంటే...
జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ప్రొద్దు తిరుగుడు గింజలు సహకరిస్తాయి. వీటిలో ఉండే ఎంజైమ్ లు మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. అంతేకాదు జీర్ణశక్తిని పెంచి, శక్తి విడుదలకు సాయపడతాయి.
వీటన్నింటితో పాటూ ఎముకల పుష్టికి, మానసిక ఆరోగ్యానికి, బీపీని నియంత్రించేందుకు కూడా ఈ గింజల్లోని విటమిన్లు, ఖనిజాలు సహకరిస్తాయి.
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: ఈ మహాత్ముడు మనకే కాదు ఎన్నో దేశాల ప్రజలకు స్పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)