Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?
Health Benefits Of Peanuts : శీతాకాలంలో వేడివేడి పల్లీలను తింటే ఆ మజాయే వేరు. పల్లీలు ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో పల్లీలను తినడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.
Health Benefits Of Peanuts : వేరుశెనగలను పోషకాల గని అని కూడా అంటారు. వేరుశనగ గింజలను పల్లీలు అని కూడా పిలుస్తారు. వీటి నుంచి నూనెను తీస్తారు. అలాగే ఈ గింజలను నేరుగా కూడా ఆహారంలో చేర్చవచ్చు. వేరుశనగ పప్పుతో చేసే పచ్చడి ఇడ్లీతో కానీ దోశతో కానీ కలిపి తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. అయితే చలి కాలంలో వేడివేడి పల్లీలను వేయించుకొని, తింటే చాలా బాగుంటుందని చెబుతూ ఉంటారు. నిజానికి చలికాలంలో పల్లీలను తినడం వల్ల కలిగే లాభాలు ఇవ్వటం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేరుశనగ లేదా పల్లీల వాడకం రోజురోజుకీ మన దేశంలో పెరుగుతూ వస్తుంది. వీటి వాడకం పెరగడం ద్వారా పోషకాహార లోపం నుంచి కొన్ని వర్గాల ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అందుకే వైద్య నిపుణులు పోషకాహారంలో భాగంగా పల్లీలను తమ డైట్లో చేర్చుకోమని సూచన చేస్తూ ఉంటారు. పల్లీలను ప్రోటీన్ బ్యాంక్ అని కూడా పిలుస్తారు వీటిలో 20 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పల్లీల్లో లభించే ఆర్జినిన్ అనే ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు.
బరువు తగ్గిస్తాయ్:
పల్లీలను రెగ్యులర్‌గా మీ ఆహారంలో చేర్చడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. దీని వెనుక ఉన్న కారణం విషయానికి వస్తే పల్లీలలో ఉండే ప్రోటీన్‌లు ఇతర పోషకాల వల్ల వీటిని బరువు తగ్గించుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పల్లీలను తీసుకోవడం ద్వారా ఆకలి ఎక్కువగా వేయదు. ఈ కారణంగా మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యవంతమైన చర్మానికి..:
పల్లీలు మీ చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. ముఖ్యంగా పల్లీల్లోని విటమిన్ బి3, నియాసిన్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచి పోషకాలను అందిస్తాయి. తద్వారా మీ చర్మం మెరిసిపోతుంది. ముఖ్యంగా పిగ్మెంటేషన్ బారిన పడకుండా పల్లీల్లోని విటమిన్ బి3 మీకు సహాయపడుతుంది.
ఫిట్నెస్ కోసం..:
మంచి ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తున్నవారు డైట్‌లో పల్లీలను చేర్చుకోవచ్చు. ఎందుకంటే పల్లీల్లో ఉండే పుష్కలమైన ప్రోటీన్లు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఎక్కువగా వ్యాయామం చేసేవారు పల్లీలను తమ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ప్రోటీన్లను పుష్కలంగా పొందవచ్చు.
అలాగే పల్లెల్లో లభించే విటమిన్ ఇ, నియాసిన్, రెస్వరటోల్ అనే పోషకాల ద్వారా మీ మెదడు చురుగ్గా ఉంటుంది. తద్వారా అల్జీమిర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. రోజూ నిర్ణీత మొత్తంలో పల్లీలను మీ డైట్‌లో చేర్చడం ద్వారా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు
అలాగే పల్లెల్లో లభించే విటమిన్ బి మీ కేశ సంరక్షణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బట్టతల గురించి బాధపడేవారు తమ డైట్లో రెగ్యులర్‌గా పల్లీలను చేర్చడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Also Read : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.