అన్వేషించండి

Gut Bacteria: కడుపు పాడైతే మెదడు మటాష్, ఆ బ్యాక్టీరియాలను కంటిపాపలా చూసుకోవాలట!

మీకు తెలుసా? మన శరీరం కొన్ని ట్రిలియన్ బ్యాక్టీరియాలు, వైరస్‌లకు ఆవాసం. వాటికి మన శరీరమే ప్రపంచం. ఆరోగ్యం చెడిపోతే.. శరీర పర్యావరణం కూడా మారిపోతుంది. ఫలితంగా అవి మెదడుకు కీడు చేసే ప్రమాదం ఉంది.

మీ శరీరం మీ ఒక్కరికే సొంతం అనుకుంటున్నారా? కానీ, కాదు.. మీ శరీరాన్ని నమ్ముకుని అనేక మంచి, చెడు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు(ఫంగస్) నివసిస్తున్నాయి. అయితే, మీరు సరైన ఆహారం తీసుకుంటూ.. తగిన వ్యాయామాలు చేస్తూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉన్నంత వరకు వాటితో మీకు ఎలాంటి సమస్య ఉండదు. వాస్తవానికి అవి మన శరీరంలో జీతం తీసుకోకుండా పనిచేస్తుంటాయి. మనం ఎప్పుడ ఆరోగ్యంగా జీవించాలని కోరకుంటాయి. ఎందుకంటే.. మన జీవించి ఉన్నంత కాలమే వాటికి కూడా మనుగడ ఉంటుంది. లేదంటే అవి కూడా ప్రాణాలు కోల్పోతాయి. 

‘సైన్స్ ఫోకస్’లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మానవ శరీరంలో సుమారు 30 ట్రిలియన్ మానవ కణాలు ఉన్నాయి. అవి కాకుండా మైక్రోబయోమ్ బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలతో కలిపి మరో 39 ట్రిలియన్ సూక్ష్మజీవుల కణాలు ఉన్నాయని అంచనా. మరో చిత్రం ఏమిటంటే.. అవి మన శరీర కణాలు కంటే చాలా చిన్నగా ఉంటాయి. వాటి సైజు వల్ల అవి మన శరీర ద్రవ్యరాశిలో కేవలం 1 నుంచి 3 శాతం మాత్రమే ఉంటాయి. అలాగని వాటిని ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. మన శరీరంలో జరిగే కొన్ని ఇన్ఫెక్షన్లకు ఇవి తోడైతే కల్లోలం తప్పదు.  

పేగుల్లోని మైక్రోబయోమ్‌లు ఏం చేస్తాయి?: మన పేగుల్లో ఉండే మైక్రోబయోమ్‌లను గట్ మైక్రోబయోమ్స్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వు నిల్వను నియంత్రిస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహిస్తుంది. విషతుల్య పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాకుండా రక్త నాళాలను సృష్టించి మానవ కణాలలో జన్యువులను యాక్టివేట్ చేస్తుంది. దెబ్బతిన్న లేదా చనిపోతున్న కణాలను కొత్త వాటితో భర్తీ చేస్తుంది. కొత్త లేదా హానికరమైన సూక్ష్మజీవులు మన శరీరంపై దాడి చేసినప్పుడు, మన శరీరంలో ఉండే సూక్ష్మజీవులు వాటితో పోరాడుతాయి.

మెదడుకు పేగుకు కనెక్షన్ ఏమిటీ?: డాక్టర్ ఆంథోనీ ఎల్ కొమరోఫ్, MD, ‘హార్వర్డ్ హెల్త్ లెటర్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఇటీవల ఓ రీడర్ అడిగిన సందేహంపై స్పందిస్తూ.. ‘‘మన ప్రేగులలో నివసించే బాక్టీరియా, సూక్ష్మజీవులు మన మెదడును ప్రభావితం చేయగలవని తెలుసుకున్నా. మన పేగులు, నోరు, ముక్కులో మనం చర్మం పైన బ్యాక్టీరియా నివసిస్తుందని కనుగొన్నాం. పేగుల్లో వ్యాధులను కలిగింగే బ్యాక్టీరియా ఉంటుంది. గత 15 సంవత్సరాల వరకు చాలా మంది వైద్యులు మన జీర్ణాశయంలో నివసించే బ్యాక్టీరియాలో ఎక్కువ భాగం కేవలం ఫ్రీలోడర్‌లని, మన శరీరానికి వెచ్చదనం అందించమే కాకుండా పోషకాలను సద్వినియోగం చేసుకుంటుందని భావించారు. అవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయ ఊహించలేదు’’ అని తెలిపారు. 
 
పేగులోని బ్యాక్టీరియా మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?: ఈ బ్యాక్టీరియాలు మన శరీరాలపై పరాన్నజీవుల వలె జీవిస్తున్నాయి. అవి నిజానికి శరీరంతో సహజీవన సంబంధాన్ని ఏర్పరుచుకుంటాయని డాక్టర్ కొమరోఫ్ వివరిస్తున్నారు. అవి కూడా ఆరోగ్యంగా ఉండేలా సమతుల్యతను కాపాడుకోవాలి. ఎందుకంటే అవి మన శరీరంలో నివసిస్తున్నప్పుడు, వాటి సొంత శారీరక జీవక్రియ, ప్రక్రియలు కూడా మన శరీరంలోనే జరుగుతాయి. మన శరీరాన్ని అవి పర్యావరణంగా భావిస్తాయి. మన ఆహారంలోని పోషకాలు గట్ నుంచి రక్తంలోకి ప్రయాణిస్తున్నట్లే.. గట్‌లోని బ్యాక్టీరియా ద్వారా తయారైన పదార్థాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. అలాగే, కొన్ని నరాలు మెదడు, ప్రేగులను కలుపుతాయి. కాబట్టి, అవి ఆరోగ్యంగా ఉన్నంత వరకే మెదడు సేఫ్‌గా ఉంటుంది. లేకపోతే మటాషే. కాబట్టి, ఆ బ్యాక్టీరియాకు చెందిన పర్యవరణం(మన శరీరం)ను పాడు చేయకూడదు. 

ఏం చేయాలి?: మన కడుపు, పేగుల్లో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాకు మంచి ఆరోగ్యాన్ని అందించాలంటే మనం ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.  ఫైబర్ గుండె జబ్బులు, క్యాన్సర్లను తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. వీలైనన్ని ఎక్కువ రకాల పండ్లు, కూరగాయలను తీసుకోండి. సీజనల్ ఫ్రూట్స్‌ను అస్సలు మిస్ కావద్దు. ఆర్టిచోక్‌లు, లీక్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లిలో అధిక-ఫైబర్ ఉంటుంది. అధిక స్థాయిలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. అధిక స్థాయి పాలీఫెనాల్స్ (సూక్ష్మజీవులకు ఇంధనంగా పనిచేసే యాంటీఆక్సిడెంట్లు) ఉన్న ఆహారం, పానీయాలను ఎంచుకోండి. ఎక్కువగా గింజలు, గింజలు, బెర్రీలు, ఆలివ్ నూనె, బ్రాసికాస్, కాఫీ, టీ తీసుకోండి. గ్రీన్ టీ తాగండి.

సొంత వైద్యం వద్దు: చాలామంది నొప్పులకు, జ్వరాలకు సొంత వైద్యం చేసుకుంటారు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ మంచి, చెడు సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. అవి కోలుకోవడానికి వారాలు పట్టవచ్చు. యాంటీబయాటిక్స్ అధికంగా వాడటం వలన బ్యాక్టీరియాలు సైతం అస్వస్థతకు గురవ్వుతాయి. పారాసెటమాల్, యాంటాసిడ్లు వంటి సాధారణ మందులు కూడా సూక్ష్మజీవులకు మంచివి కావు. అతి శుభ్రత కూడా అంత మంచిది కాదు. సప్లిమెంట్లను కూడా తక్కువగా తీసుకోవాలి. అప్పుడే మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు కూడా సేఫ్‌గా ఉంటుంది. 

గ్రామాలే ఉత్తమం: నగరవాసుల కంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలే మెరుగైన సూక్ష్మ జీవులను కలిగి ఉంటారు. వ్యవసాయం, తోటపని వంటివి వారి పేగుల్లో ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్‌లు పెరిగేందుకు సహకరిస్తాయి. కుక్కలతో నివసించే వ్యక్తులు ఎక్కువ సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

చిరుతిళ్లు తగ్గించండి: భోజనం మధ్య విరామం ఉండాలి. దాని వల్ల సూక్ష్మ జీవులకు విశ్రాంతి లభిస్తుంది. అప్పుడప్పుడు భోజనం మానేయండి లేదా ఎక్కువసేపు ఉపవాసం ఉండండి. దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా కూడా చేస్తుంది.

Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త 

ప్రాసెస్ చేసిన ఆహారాలు, కృత్రిమ స్వీటెనర్‌లు వద్దు: సుక్రోలోజ్, సాచరైన్ వంటివి సూక్ష్మజీవుల జీవక్రియకు అంతరాయం కలిగిస్తాయి. గట్ వైవిధ్యాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా ఊబకాయం, మధుమేహా సమస్యలు వస్తాయి.

పులియబెట్టిన ఆహారాలు తినొచ్చు: ప్రత్యక్ష సూక్ష్మజీవులను కలిగి ఉండే పుల్లని ఆహారాన్ని తీసుకోవచ్చు. మజ్జిగ, లస్సీ, కిమ్చి (వెల్లుల్లి, క్యాబేజీ, మిరపకాయలతో చేసిన కొరియన్ వంటకం), సోయా సాస్, టేంపే, నాటో వంటి సోయాబీన్ ఆధారిత ఉత్పత్తులు చాలా మంచి ప్రోబయోటిక్ ఆహారాలు.

Also Read: అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లుPamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
Meenaakshi Chaudhary : 'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Srikakulam Politics: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
Embed widget