Green chillies : పచ్చిమిర్చిని పచ్చిగా తింటే ఎన్ని లాభాలో తెలుసా? బరువు తగ్గడం నుంచి ఇమ్యూనిటీ వరకు మరెన్నో బెనిఫిట్స్ ఇవే
Wight Loss with Green Chillies : పచ్చిమిర్చిని కొందరు కూరల్లో వేసినా తీసేస్తారు. కానీ పచ్చిమిర్చిని నేరుగా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయంటున్నారు. అవేంటంటే..
Green chillies Benefits : ఇప్పుడంటే కూరల్లో కారం కోసం, రుచి కోసం పచ్చిమిర్చిని ఉపయోగిస్తున్నారు కానీ.. గతంలో చద్దన్నంలో, గంజి అన్నంలో పచ్చిమిర్చిని వేసుకుని నేరుగా తినేవారు. అలా తినడం వల్ల నోటికి రుచే కాదు.. ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందేవట. అందుకే పచ్చిమిర్చిని కచ్చితంగా డైట్లో తీసుకోవాలంటున్నారు నిపుణులు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి నమ్మలేనన్ని బెనిఫిట్స్‌ను అందిస్తాయి. మరి పచ్చిమిర్చి తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
ఇమ్యూనిటికై..
పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తాయి. అలాగే స్కిన్‌కి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు పాడుకాకుండా హెల్ప్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి.
బరువు తగ్గేందుకు
పచ్చిమిర్చి మెటబాలీజం పెంచుతుంది. జీవక్రియ ఫాస్ట్‌గా ఉంటే.. బరువు తగ్గడం ఈజీ అవుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించి.. ఆరోగ్యకరమైన పద్ధతిలో ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమిర్చిని తమ డైట్లో చేర్చుకోవచ్చు.
నొప్పులు దూరం
పచ్చిమిర్చి నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది. పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ మెదడుకు నొప్పిని తీసుకువెల్లే సంకేతాలను నిరోధించి.. నొప్పిని త్వరగా తగ్గేలా చేస్తుంది.
జీర్ణ సమస్యలు
పచ్చిమిర్చి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. సహజంగానే గట్ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
గుండె ఆరోగ్యానికై..
చెడు కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు పంపడంలో పచ్చిమిర్చి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి గుండె సమస్యలను తగ్గించి.. గుండెకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి.
శ్వాస సమస్యలు ఉంటే..
చలికాలంలో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడానికి డైట్లో పచ్చిమిర్చిని చేర్చుకోవాలి. ఇది ముక్కు రంధ్రాలు మూసుకుపోకుండా చేసి.. గాలి ఆడేలా హెల్ప్ చేస్తుంది. సైనస్ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
మధుమేహం..
మధుమేహాన్ని అదుపులో ఉంచి ఇన్సులిన్ సెన్సిటివిటీని దూరం చేస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని రెగ్యులర్‌గా దీనిని తీసుకోవచ్చు.
మరెన్నో బెనిఫిట్స్
శరీరానికి ఇతర ఆహారపదార్థాలనుంచి అందే పోషకాలను గ్రహించడంలో పచ్చిమిర్చి బాగా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల శారీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. క్యాన్సర్ కణాల దూరం చేసే సత్తా కూడా పచ్చిమిర్చిలో ఉందని పలు అధ్యయనాలు నిరూపించాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి.. సెన్సిటివ్‌గా ఉండేవారు, కారం తినని వాటికి దూరంగా ఉంటే మంచిది. పచ్చిమిర్చి తిన్న తర్వాత లేదా వాటిని పట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ చేతులను ముఖంపై లేదా కంటిపై ఎక్కడైనా టచ్ చేస్తే ఆ ప్రాంతం మండుతుంది. స్కిన్ ఇరిటేషన్ రావొచ్చు. ఆరోగ్య సమస్యలున్నవారు కూడా వైద్యుల సలహా తీసుకుని పచ్చిమిర్చిని తమ డైట్లో తీసుకుంటే మంచిది.
Also Read : ఫ్రిడ్జ్ పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.