అన్వేషించండి

Mothers Day Gifts: అమ్మకో అందమైన బహుమతి, తక్కువ బడ్జెట్‌లోనే ఇవి దొరుకుతాయి

అమ్మ కోసం ఏం బహుమతి కొనాలా అని ఆలోచిస్తున్నారా? వీటిని ప్రయత్నించండి.

తల్లి ప్రేమకు ప్రపంచంలోని ఏ ప్రేమ సాటిరాదు. అమ్మ ప్రేమ ముందు ఏదైనా తలవంచాల్సిందే. మనిషి స్వచ్ఛమైన ప్రేమ అందేది అమ్మ నుంచే. అమ్మకు బిడ్డ పట్ల ఆపేక్ష, ప్రేమ తప్ప... ఇంకే ఆశ ఉండదు. మన ఎంత ఎదిగినా ఆ తల్లి బిడ్డలమే అని మరిచిపోకూడదు. ఉద్యోగాల కోసం ఎంతో మంది అమ్మను ఊర్లోనే విడిచి దూర తీరాలకు వెళుతున్నారు. ఆధునిక కాలంలో ఎంత దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్న ఫీలింగ్ అందించే  ఆధునిక పరికరాలు వచ్చాయి. రోజూ అమ్మతో మాట్లాడడం, అమ్మ బాగోగులు తెలుసుకోవడం, ఆమెకు కావాల్సినవి ఆర్డర్ పెట్టి పంపించడం వంటివి చేయాలి. వీలైతే మీరున్న చోటికే తల్లిదండ్రులను తీసుకెళ్లి చూసుకుంటే మరీ మంచిది. తల్లి కోసం మనం ఎంత చేసినా అది తక్కువే. ఆమె  తన ప్రాణాన్ని పణంగా పెట్టి మీకు ప్రాణం పోసింది. ప్రేమగా సాకి పెద్దవారిని చేసింది. ఆ త్యాగాలను స్మరించుకునేందుకే ప్రతి ఏటా వస్తుంది ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవం’. ఆ రోజున ఆమెకు చిన్న బహుమతిని కొని పెట్టండి. ఎంతో సంతోషిస్తుంది. దీని కోసం వేలు, లక్షలు ఖర్చుపెట్టక్కర్లేదు. ఉద్యోగులైనా, విద్యార్థులైనా తక్కువ బడ్జెట్ లోనే అమ్మను సంతోషపెట్టే బహుమతులు కొనవచ్చు. ఎక్కువ ఖర్చుపెడితే అమ్మ మళ్లీ బడితే దెబ్బలు వేయచ్చు. దుబారాగా ఖర్చు పెట్టడం ఏ తల్లికీ ఇష్టం ఉండదు. ఇక ఏం కొనాలో చూద్దాం. 

1. ఏ మహిళకైనా కొత్త చీరంటే ప్రాణం. ఎన్ని చీరలున్నా ఇంకా చీరలు కావాలనిపిస్తుంది. మీ తల్లికి ఇష్టమైన రంగు చీరను తీసుకెళ్లి బహుమతిగా ఇవ్వండి. ఇది చిన్న బహుమతే అయినా ఆమె ఆనందం మాత్రం అధికంగా ఉంటుంది. 

2. మీ తల్లి దైవ భక్తురాలైతే రోజులో కనీసం అరగంటైనా ఆమె పూజగదిలో ఉంటుంది. మీరు ఆమె లేచే సరికే ఆ గదిని అందమైన పూలతో అలంకరించండి. పూలు కొనేందుకు అయ్యే ఖర్చు కూడా తక్కువే. ఆమె తలలో పెట్టుకునేందుకు కూడా పూలను కొని రెడీ ఉంచండి. ఆమెతో కలిసి పూజ చేయండి. ఇది చిన్న పనే అయితే మీ తల్లి సంతోషం మాత్రం హద్దులు దాటుతుంది. 

3. అమ్మ చిన్నప్పటి ఫోటోలు, పెళ్లి  ఫోటోలు, మీతో ఉన్న ఫోటోలను సేకరించి ఒక ఆల్బమ్ తయారు చేయండి. స్క్రాప్ బుక్ లా చేస్తే ఇంకా బావుంటుంది. దాన్ని ఆమెకు బహుమతిగా అందిస్తే వాటిని చూసి మురిసిపోవడం ఖాయం. ఆమె ముఖంలో ఆనందం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. 

4. రోజూ అమ్మ వండితే మీరు తింటున్నారు కదా, ఈ ఒక్క రోజు ఆమెను కూర్చోబెట్టి  మీరూ వండండి. అమ్మకు ఏవి ఇష్టమో తెలుసుకుని మరీ వండాలి. ఆమెతో కలిసి భోజనం చేయండి. కులాసాగా కబుర్లు చెప్పండి. ఆమె ఎంతో సంతోషిస్తుంది. 

5. విద్యార్థులు ఎక్కువ డబ్బులు బహుమతుల కోసం ఖర్చుపెట్టలేరు. కానీ ఉద్యోగులైన పిల్లలు తల్లికి ఏమైనా కొనగలరు. ఒక అందమైన ఉంగరాన్ని కొని ఆమె ఇవ్వండి. అంతకన్నా ఎక్కువ ఖర్చుపెడితే ‘డబ్బులు ఎందుకు వేస్టు చేస్తున్నావ్’ అంటూ అమ్మ తిట్టే అవకాశం ఉంది. 

6. స్నేహితులతో బయటకు వెళ్లి హ్యాంగవుట్స్ చేస్తారుగా. అలా మదర్స్ డే రోజు అమ్మతో బయటికి వెళ్లండి. ఒక సినిమా చూసి, బయటే ఆమెకు నచ్చిన రెస్టారెంట్లో లంచ్ లేదా డిన్నర్ చేసి ఇంటికి రండి. ఆ రోజంతా ఆమెతోనే ఉండండి. ఆమెతోనే మాట్లాడండి.ఓ తల్లి ఇంతకన్నా కోరుకునేది ఏమీ లేదు. 

Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

 

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget