News
News
వీడియోలు ఆటలు
X

International Mothers Day: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

అమ్మను మించిన బంధం మరొకటి లేదు. ఆమెకు అందంగా శుభాకాంక్షలు చెప్పాల్సిందే.

FOLLOW US: 
Share:

అనుబంధానికి అర్ధం అమ్మ. బంధాలను, ప్రేమను, ఈ  ప్రపంచాన్ని బిడ్డకు పరిచయం చేసేది అమ్మే. అమ్మ గుండె చప్పుడు వింటూ పెరిగిన బిడ్డకు ఆమెనే సర్వస్వం. బిడ్డల జీవితం కోం తమ జీవితాన్నే అంకితం చేస్తారు తల్లులు. బిడ్డల పెంపకం కోసం తమ కెరీర్ ను, చదువును పక్కన పెట్టిన తల్లులు ఎంతో. వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం కోసమే ఏర్పడింది ‘అంతర్జాతీయ మాతృ దినోత్సవం’.  ప్రతి ఏడాది మేలో వచ్చే రెండో ఆదివారాన్ని అమ్మల దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఈ రోజున తల్లుల త్యాగాలను, శ్రమను గుర్తించి వారికి అందమైన బహుమతితో శుభాకాంక్షలు చెప్పండి. వందేళ్లకు పైగా ఈ దినోత్సవాన్ని ప్రపంచం నిర్వహించుకుంటోంది. అమెరికాలో తొలి అమ్మల దినోత్సవాన్ని 1910లో నిర్వహించుకున్నారు. అమెరికా నుంచి మిగతా దేశాలకు పాకింది మాతృ దినోత్సవం.  బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమ్మకు ఒక రోజంటూ ఉండాలన్న కారణంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచ హాట్ ఫేవరేట్ దినోత్సవంగా మారిపోయింది. 

1. అంతులేని అనురాగం అమ్మ
అలుపెరుగని ఓర్పు అమ్మ
అరుదైన ప్రేమ రూపం అమ్మ
ప్రపంచంలోని అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

2. అమ్మ చేసే ప్రతి పని
మన ఆనందం కసమే
మన ఆనందంలోనే
తన ఆనందాన్ని వెతుక్కునే
గొప్ప ప్రేమ మూర్తి అమ్మ
అలాంటి అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

3. ప్రేమను పరిచయం చేసిన ఆమెను ప్రేమిద్ధాం
తల్లిగా ఆమె చేసిన సేవలను గుర్తిద్దాం
ఆమెకు కష్టం రాకుండా కాపాడుకుందాం
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

4. అమ్మ అందమైన అనుబంధం
అంతులేని అనురాగం
మరపురాని మధుర బంధం
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

5. అమ్మ గొప్పతనాన్ని తెలిపేందుకు భాష చాలడం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే 
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

6. ఈ లోపంలో నువ్వు ఎంత ద్వేషించినా
నిన్ను ప్రేమించేది కేవలం తల్లి మాత్రమే
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

7. ఈ లోకంలో అన్నింటికన్నా అమూల్యమైనది
అతి మధురమైనది, అనంతమైనది 
అమ్మ అనురాగం ఒక్కటే
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

8. అమ్మంటే...రేపటి మీ భవిష్యత్తు కోసం
నేటి నుంచే శ్రమించే నిత్య శ్రామికురాలు
అలాంటి అమ్మలందరికీ  
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

9. ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా
నేనున్నా... అంటూ ధైర్యం చెప్పే వ్యక్తి అమ్మ. 
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

10. నీకు మాకోసం చేసిన త్యాగాలు,
మమ్మల్ని పెంచడానికి పడిన బాధలు వెలకట్టలేనివి
వాటికి చిన్న థ్యాంక్స్ అనే పదంతో  సరిపెట్టలేము
నీకు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము
అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

11. ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసిన
మా అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

12. ఓర్పుకు, సహనానికి మారుపేరు అమ్మ
తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

13. అమ్మ లేని ఇల్లు చందమామలేని ఆకాశంలాంటిది
అమ్మ ఉంటేనే అందం, ఆనందం
ప్రపంచంలోని అమ్మలందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

14. తన ప్రాణాలను పణంగా పెట్టి
నీకు ప్రాణం పోసే దేవత అమ్మ
తల్లులందరికీ 
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

15. గుడి లేని దేవత నువ్వు
కల్మషం లేనిది నీ ప్రేమ
అమృతం కన్నా తియ్యనైనది నీ మాట
అమ్మా... అందుకో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

16. కనిపించని దేవుడైనా
కని పెంచే నీ తరువాతే అమ్మా...
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Also read: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం

Published at : 13 May 2023 07:44 AM (IST) Tags: Mothers Day Quotes International Mothers day Mothers day Quotes in Telugu mothers day Wishes

సంబంధిత కథనాలు

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి

టాప్ స్టోరీస్

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్