బంగాళాదుంపల అప్పడాల రెసిపీ



బంగాళాదుంపలు పెద్దవి - మూడు
ఆయిల్ - ఒక స్పూను
ఎండు మిర్చి - రెండు
ఉప్పు - రుచికి సరిపడా



బంగాళా దుంపలను మెత్తగా ఉడకబెట్టాలి. తరువాత చల్లారనివ్వాలి.



ఒక దుంపలను మెత్తగా మెదిపి ఉప్పు, ఎండు మిర్చి తురుము వేసి కలపాలి.



అర స్పూను నూనె కూడా వేసి కలపాలి. ఒక ప్లాస్టిక్ షీట్ మీద కూడా కాస్త నూనె రాయాలి.



చిన్న పిండి ముద్దను తీసి షీట్ మీద పెట్టి చేత్తోనే ఒత్తుకోవాలి.



అప్పడాల్లా చేత్తోనో ఒత్తుకుని ఒక పొడి చీరపై ఆరబెట్టాలి.



అన్ని అప్పడాలను అలా చేసి ఎండ బెట్టాలి.



బాగా ఎండాక దాచి పెట్టుకోవాలి. అవసరం అయినప్పుడు నూనెలో వేయించుకోవాలి.