కంటికి వచ్చే క్యాన్సర్ ఇది



రెటినోబ్లాస్టోమా.. ఇది కంటికి వచ్చే క్యాన్సర్. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలను చాలా ప్రభావితం చేస్తుంది.



ఈ క్యాన్సర్లో భాగంగా కంటిలోని రెటీనా భాగంలో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి.



ఇది వచ్చిన పిల్లల్లో కంటిలోని నల్ల గుడ్డుపై తెల్లటి మచ్చ కనపడుతుంది.



మెల్లకన్ను వచ్చినా, కనుపాప రంగులో మార్పులు కనబడినా, కళ్ళు ఎరుపెక్కినా లేదా వాపు వచ్చినా క్యాన్సర్ వచ్చిందేమో అనుమానించాలి.



కళ్ళు ఎలాంటి కారణం లేకుండా నొప్పి పెడుతున్నా, అసౌకర్యంగా అనిపిస్తున్నా వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి.



చూపులో మార్పులు వచ్చినా కూడా అది ఈ క్యాన్సర్ లక్షణం కావచ్చు.



ఈ క్యాన్సర్ పిల్లల్లో ఎప్పుడైనా రావచ్చు. ముఖ్యంగా ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది.



నెలలు నిండకుండా పుట్టే శిశువులు, రేడియేషన్ బారిన పడిన పిల్లల్లో ఇది అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువ.