రాత్రిపూట పెరుగు తినవచ్చా?



పెరుగును రాత్రిపూట తింటే కఫం పడుతుందని అంటారు. అయినా చాలా మంది తినే వాళ్లు ఉన్నారు.



నిజంగానే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫటం పడుతుందా? పోషకాహారా నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.



న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం రాత్రి పూట పెరుగు తినడం వల్ల ఎలాంటి హాని జరగదు.



కానీ ఒక కప్పు పెరుగుతోనే ఆపేయాలి. పెరుగులో కూడా ఫ్యాట్స్, ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. రాత్రిపూట జీర్ణమవ్వడం కష్టంగా ఉంటుంది.



కాబట్టి ఒక కప్పు పెరుగుతోనే ఆపేయాలి. ఇది మిగతా పోషకాలను కూడా బ్యాలెన్స్ చేస్తుంది.



పెరుగు వల్ల అజీర్తి సమస్యలు పెరగకుండా ఉండాలంటే అల్పాహారంలో లేదా మధ్యాహ్న భోజనంలో భాగంగా తీసుకోవాలి.



పెరుగులో పండ్ల ముక్కలు కలుపుకుని తింటే మరీ మంచిది.