వేసవిలో చల్లచల్లని ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా మందికి ఇష్టం. కానీ మీకు తెలుసా దీన్ని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని. సమ్మర్ లో వేడి గాలుల కంటే ఆహారం వల్ల వచ్చే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. వేసవి కాలంలో ఐస్ క్రీమ్ తినకుండ ఎవరూ ఉండలేరు. కానీ ఇది మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనిలో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా వంటి బ్యాక్టీరియాను కలిగి ఉన్నాయి. ఇవన్నీ వేసవి వేడి ఉష్ణోగ్రతలో వృద్ధి చెందుతాయి. లిస్టేరియా బ్యాక్టీరియా ఫ్రీజర్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుని జీవించగలదు. సలాడ్ ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా ఉంటుంది. కానీ సలాడ్ కలుషితానికి అతి పెద్ద మూలం పాలకూర. కొన్నిసార్లు ఆకు కూరలపై కనిపించే హానికరమైన సూక్ష్మక్రిములు సాల్మొనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా ఇవన్నీ ప్రాణాంతకం కావచ్చు. సూపర్ మార్కెట్ల నుంచి సలాడ్ కొనుక్కోవడం కంటే ఇంట్లోనే వండిన సలాడ్ తినమని వైద్యులు చెబుతున్నారు పచ్చి మొలకలు పోషకాహారం, ఆరోగ్యంతో కూడిన సూపర్ ఫుడ్ అయినప్పటికీ ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. US FDA ప్రకారం ప్రతి సంవత్సరం పచ్చి మొలకలు నుండి కనీసం 148 ఆహారపదార్థాల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందుకే తినడానికి ముందు మొలకలను ఎప్పుడూ కాల్చడం లేదా వేడి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.