మొబైల్ వినియోగంతో హైబీపీ వచ్చే అవకాశం



టాయిలెట్ సీటు కంటే మొబైల్ ఫోన్ పైన ఉండే బ్యాక్టీరియా ఎక్కువ అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.



ఇప్పుడు మరొక అధ్యయనం మొబైల్లో ఫోన్లు ఎక్కువగా మాట్లాడే వారికి హైబీపీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.



సాధారణ వ్యక్తితో పోలిస్తే రోజుకు 30 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం 12 శాతం ఉన్నట్టు చెబుతోంది అధ్యయనం.



మొబైల్ ఫోన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ విడుదలవుతుంది. ఇది తక్కువ స్థాయిలోనే ఉన్న రోజూ మాట్లాడటం వల్ల దీని ప్రభావం మన శరీరం పై, ఆరోగ్యం పై పడుతుంది.



రక్త పోటు పెరుగుదలతో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ముడిపడి ఉంది.



కేవలం కాల్స్ మాట్లాడితేనే కాదు మెసేజ్ చేసుకుంటున్నా, గేమ్ ఆడుకుంటున్నా కూడా రక్తపోటు పై ప్రభావం పడుతుంది.



హై బీపీ లేని వారు కూడా మొబైల్ అధికంగా వాడితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.



ప్రపంచంలో ముందస్తు మరణాలలో అధిక రక్తపోటు కూడా ఒక కారణం.