ముఖ వెంట్రుకలు తొలగించే ‘ఫేస్ రేజర్’ మొన్నటి వరకు షేవింగ్ అనేది కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన పదం. ఇప్పుడు మహిళల కోసం కొత్త సౌందర్య సాధనం ‘ఫేస్ రేజర్’ వచ్చింది. మహిళలు ముఖంపై ఉన్న చిన్న చిన్న వెంట్రుకలను కూడా తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నారు. చర్మంపై ఉన్న జుట్టును తొలగించడానికి షేవింగ్ అనేది సులభమైన పద్ధతిగా భావిస్తున్నారు. అందుకే ఫేషియల్ షేవింగ్ కు ఇష్టపడుతున్నారు. ఫేస్ రేజర్ వాడడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. ఇది జుట్టుతో పాటు మృత కణాలను కూడా తొలగిస్తుంది. షేవింగ్ చేసుకున్నాక మేకప్ చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు ముఖంలో మెరుపు ఉంటుంది. సోరియాసిస్, మొటిమలు, తామర వంటి సమస్యలు ఉన్నవారు, సున్నితమైన చర్మం కలవారు ఎట్టి పరిస్థితుల్లో రేజర్ వాడకూడదు. లేకుంటే దద్దుర్లు, అసౌకర్యం, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే అవకాశం ఉంది.