లైంగికాసక్తి తగ్గడానికి ఆ విటమిన్ లోపమే కారణం భార్యాభర్తల బంధంలో లైంగిక చర్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచి దూరాన్ని తగ్గిస్తుంది. కానీ కొంతమందిలో ఆ ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. ఎందుకో కారణం వారికి కూడా తెలియదు. దీనివల్ల వైవాహిక బంధంలో కలతలు రావచ్చు. లైంగికాసక్తి తగ్గడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కారణాల్లో ఒకటి విటమిన్ డి లోపం. విటమిన్ డి ను ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. అలాగే ‘సెక్స్ విటమిన్’ అని కూడా అంటారు. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం విటమిన్ డి లోపం వల్ల వ్యక్తుల సెక్స్ డ్రైవ్‌లో మార్పులు వస్తాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే లైంగికాసక్తి తగ్గిపోతుంది. విటమిన్ డి లోపిస్తే మహిళల్లోనూ ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల వారిలోనూ సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతుంది. తక్కువ సెక్స్ డ్రైవ్‌తో బాధపడుతున్నవారు 2 వారాల పాటూ రోజుకు 30 నిమిషాలు ఉదయం పూట ఎండలో నిలబడితే మంచిది.