భోజనం చేశాక ఇలా చేస్తే డయాబెటిస్ పెరగదు ఆరోగ్యకరమైన జీవనశైలిలో నడకది ప్రధాన పాత్ర. వ్యాయామం చేయలేని వారికి నడక ఎంతో మేలు చేస్తుంది. భోజనం చేశాక ఒక పది నిమిషాలు నడపడం వల్ల మధుమేహం అదుపులో ఉంచుకోవచ్చని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామంది మధ్యాహ్న భోజనం చేసి ఒక గంట సేపు కునుకేస్తారు. ఇది ఆరోగ్యానికి చెడే చేస్తుంది. భోజనం చేసాక కనీసం 10 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. తిన్నాక నడవడం వల్ల టైప్2 మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అంతేకాదు గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు 11 నిమిషాలు చురుగ్గా నడిస్తే చాలు. వారానికి 75 నిమిషాల నడక వల్ల ముందస్తు మరణ ప్రమాదాన్ని 23% తగ్గిస్తుందని ఆ అధ్యయనం చెబుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17% తగ్గించుకోవచ్చని, క్యాన్సర్ ప్రమాదాన్ని ఏడు శాతం తగ్గించుకోవచ్చు.