ఇందుకే చేపలు కచ్చితంగా తినాలి నాన్ వెజ్ ప్రియుల్లో కొంతమంది చేపలను తినడానికి ఇష్టపడరు. కానీ చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపలు తినడం వల్ల శరీరం సమతుల ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శక్తిని, బలాన్ని పెంచుతుంది. వీటిని తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో చేరుతాయి. ఇవి మానవ మెదడు, కంటి చూపుకు చాలా ముఖ్యం. చేపల్లో మన కండరాలకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఎంత తిన్నా మంచిదే. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు తినడం వల్ల కంటి చూపు బలంగా మారుతుంది. గుండె కండరాలకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. గుండెకు మేలు చేసే PF ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో ఉంటాయి. ఇవి మీ గుండెకు బలాన్ని ఇస్తాయి. పెరుగుదలకు చేపలు చాలా సహకరిస్తాయి. ఇవి జుట్టు మెరిసేలా మందంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. వారానికి కనీసం రెండు సార్లు చేపల కూర తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.