లాడా, ఇది టైప్ 1.5 డయాబెటిస్



టైప్ 1 ,టైప్ 2 డయాబెటిస్ లాగే టైప్ 1.5 డయాబెటిస్ కూడా ఉంది.



టైప్ 1.5 డయాబెటిస్ ను LADA అంటారు. దీన్ని ‘ది లాటెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్’ అని కూడా పిలుస్తారు.



LADA పెద్దలకు మాత్రమే వస్తుంది. పిల్లల్లో కనిపించదు. చాలా నెమ్మదిగా శరీరంలో చేరి అభివృద్ధి చెందుతూ ఉంటుంది.



మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడాన్ని ఆపివేసిన తర్వాత, ఈ టైప్ 1.5 డయాబెటిస్ ప్రారంభమవుతుంది.



ప్రస్తుతం ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో పది శాతం మంది ఈ టైప్ 1.5 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నట్టు అంచనా.



LADA సాధారణంగా 30 ఏళ్ల వయసు దాటిన వారిలోనే అభివృద్ధి చెందుతుంది.



దాన్ని చాలా మంది టైప్2 డయాబెటిస్ అనుకుని, వాటి మందులే వాడుతూ ఉంటారు.



టైప్1, టైప్2 డయాబెటిస్‌లో కనిపించే లక్షణాలే ఈ LADAలో కూడా కనిపిస్తాయి.