క్యారెట్ దోశ ఇలా చేయండి



బియ్యం - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
మినపప్పు - ఒక కప్పు
తురిమిన క్యారెట్ - ఒక కప్పు
కారం - ఒక టీస్పూను
జీలకర్ర - ఒక టీస్పూను
నూనె - సరిపడా



బియ్యం, మినపప్పును నీటిలో నానబెట్టాలి. ఆ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో వేసి ఒక రాత్రంతా ఉంచాలి.



స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి క్యారెట్ వేసి వేయించాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టే, కారం, జీలకర్ర కూడా వేసి కలపాలి.



క్యారెట్ కాస్త వేగాక స్టవ్ కట్టేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.



ఆ మిశ్రమాన్ని దోశె పిండిలో వేసి బాగా కలిపేయాలి. ఉప్పు వేసి కలపాలి.



స్టవ్ పై పెనం పెట్టి దోశెలా వేసుకోవాలి.



క్యారెట్ దోశె రెడీ అయినట్టే. కొబ్బరి చట్నీతో దోశె టేస్టీగా ఉంటుంది.