ఈ తేనె ఖరీదు 9 లక్షల రూపాయలు



సాధారణ తేనే కిలో 500 నుంచి 600 రూపాయలు ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన తేనే ఒకటుంది.



దాని పేరు ‘ఎల్విష్ తేనె’. కిలో తేనెను కొనాలంటే 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి.



ఈ ఎల్విష్ తేనే ప్రపంచంలో కేవలం ఒకే చోట లభిస్తుంది. అది టర్కీలోని నల్ల సముద్ర ప్రాంతంలో ఉన్న ఒక గుహలో మాత్రమే.



ఆ గుహలో పెట్టే తేనె తుట్టే నుంచి మాత్రమే ఈ తేనెను సేకరిస్తారు. ఈ గుహ టర్కీలోని ఒక నగరానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంది.



కేవలం నిపుణులు మాత్రమే ఈ తేనె సేకరణకు వెళ్తారు. ఎవరు పడితే వారు వెళ్లడానికి అనుమతి లేదు.



ఏడాదికి ఒక్కసారి మాత్రమే దీన్ని సేకరిస్తారు. ఆ గుహలో అంతా ఔషధ మొక్కలు నిండి ఉంటాయి.



ఆ ఔషధ మొక్కలకు పూసిన పువ్వుల నుండే మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనెను తయారుచేస్తాయి.



అందుకే ఈ తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ తేనే ఇంత ఖరీదు చేస్తుంది.