మామిడి పండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా? మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే బరువు విషయంలో అపోహలు ఉన్నాయి. మామిడి పండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా? అనేది ఎక్కువ మందికి ఉన్న సందేహం. ఈ పండ్లలో క్యాలరీలు, చక్కెరలు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, సి, ఐరన్, పొటాషియం, కాపర్ వంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. చక్కెర, క్యాలరీలు అధికంగా ఉన్నందున బరువు పెరుగుతారన్న భయం అవసరం లేదు. రోజుకు రెండు పండ్లకు మించి తినకపోవడమే మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భిణులు మామిడి పండ్లను తింటే ఎంతో మేలు. అయితే జెస్టేషనల్ డయాబెటిస్ తో బాధపడే గర్భిణులు మాత్రం తక్కువ తినాలి. తినే ముందు మామిడి పండ్లను చల్లటి నీటిలో ఒక అరగంట పాటూ నానబెట్టాలి.