గోర్లు కొరకడం, ముక్కులో వేళ్ళు పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి చెత్త అలవాట్ల వల్ల డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. బాధగా అనిపించినప్పుడు చాలా మంది ఒంటరిగా గడిపేందుకు మొగ్గు చూపుతారు. ఒంటరిగా ఉంటే మెదడు క్షీణతను తీవ్రతరం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం డిమెన్షియా ముఖ్యంగా వృద్దుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జంక్ ఫుడ్ తినడం అంటే చాలా మందికి ఇష్టమే. కానీ ఇవి ఎక్కువగా తినే వ్యక్తుల్లోని మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెరలు ఉన్న ఆహారం తీసుకుంటే మెదడు మీద ప్రభావం చూపుతాయి. రాత్రి ఐదు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో చిత్తవైకల్యం వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ. నిద్రలేమి వల్ల చనిపోయే అవకాశం రెండు రేట్లు ఎక్కువగా ఉంటుంది. 30 నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ ఉపయోగించి ఫుల్ వాల్యూమ్ లో సంగీతం వింటున్నారా? అలా చేస్తే డిమెన్షియా వచ్చేస్తుంది. హెడ్ ఫోన్స్ గరిష్ట వాల్యూమ్ లో 60 శాతానికి మించకుండా వాల్యూమ్ తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.