ఎక్కువసేపు మొబైల్ చూస్తే మొటిమలు వచ్చే అవకాశం? సాంకేతికత పరుగులు పెడుతున్న యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండాల్సిందే. రాత్రి అయితే చాలు ఫోన్లో సినిమాలు చూస్తూ ఎక్కువ సమయం చర్మంపై ఆ కాంతి పడేలా చేస్తున్నారు. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా అక్షరాలా నిజం. స్మార్ట్ ఫోన్ వల్ల చర్మం దెబ్బ తింటుంది. బాత్రూంలో ఉండే టాయిలెట్ సీట్ మీద ఉన్న బ్యాక్టీరియా కంటే ఫోన్ పై ఉన్న బ్యాక్టీరియానే ఎక్కువ. అలా ఫోన్ ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా చర్మానికి చేరుతుంది. దీనివల్ల మొటిమలు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మీ మొబైల్‌ను రోజూ యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడవాలి. ఇలా చేయడం వల్ల దానిపై ఉన్న బ్యాక్టీరియా పోయే అవకాశం ఉంది. తద్వారా చర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు.