సన్ ఫ్లవర్ నూనెతో చర్మానికి మెరుపు

వంటల్లో సన్ ఫ్లవర్ నూనె వాడడం వల్ల ఎంతో ఆరోగ్యం. అలాగే అందాన్ని అందిస్తుంది.

ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.

చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.

ఈ నూనెలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఈ నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడతాయి.

దీనిలో లినోలెయిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని పొడిబారనివ్వదు.

అప్పుడప్పుడు దీన్ని ముఖానికి రాసి, మర్ధనా చేసుకుంటే మంచిది. పై ఫలితాలన్నీ పొందవచ్చు.