ఆవు పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి? ప్రపంచంలో కొన్ని ప్రశ్నలు వినోదభరితంగా అనిపించవచ్చు, కానీ దానికి సైన్స్ కచ్చితంగా ఒక జవాబును కనిపెట్టే ఉంటుంది. ఆవు ఆకుపచ్చని గడ్డి తింటే పాలు తెల్లగా ఉంటాయి ఎందుకు? దీనికి సైన్సు ఏం చెబుతోంది? ఆవు పొట్టలో పాలు ప్రధానంగా నీటితోనే తయారవుతాయి. పాల రకాన్ని బట్టి కొవ్వు, ప్రోటీన్, చక్కెర వంటివి ఉంటాయి. పాలల్లో ఉండే ప్రోటీన్లలో ముఖ్యమైనది కేసైన్. ఆవు పాలలో 80 శాతం కేసైన్ ఉంటుంది. కేసైన్ తెల్లగా ఉంటుంది. కేసైన్లో భాస్వరం అణువులు ఉంటాయి. ఈ భాస్వరం అణువులు పాలల్లో మైకెల్స్ అని పిలిచే చిన్న అణువుల సమూహాలు ఏర్పడడానికి సహకరిస్తాయి. పాలపై కాంతి పడినప్పుడు సహజంగానే తెలుపు రంగులో ఉండే కేసైన్ అణువులు చెల్లాచెదురుగా అవుతాయి. అవి పాలల్లో 80 శాతం ఉంటాయి కాబట్టి వాటి తెలుపు రంగునే పాలు కూడా ప్రతిబింబిస్తుంది. పాలల్లో నీరు కలిసినప్పుడు పాలు దాని రంగును కోల్పోవడం మొదలుపెడుతుంది.