తిన్న ఆహారం మీ శరీరానికి సరిపోతోందా? అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చాలామందికి తెలుసు. అలాగే సరిపడినంత తినకపోయినా కూడా అలాంటి ప్రభావాలే కనిపిస్తాయి. శరీరానికి సరిపడా పోషకాలు, కేలరీలు ఉండే ఆహారం తినడం చాలా అవసరం. మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఆహారానికి కోత పెడితే శరీరం తట్టుకోలేదు. కొన్ని లక్షణాల ద్వారా మీరు సరిపడా తినడం లేదని చెబుతుంది శరీరం. తీవ్ర అలసటగా అనిపిస్తుంది. జుట్టు రాలిపోతుంది. ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఎక్కువగా చిరాకు వేస్తుంది. మల బద్ధకం