ఒత్తిడిని తట్టుకునేందుకు ఆరు చిట్కాలు ఇవిగో

ఒత్తిడి బారిన పడితే చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళల్లో ఒత్తిడి ఎక్కువ.


ఒత్తిడి వల్ల మహిళల్లో పీరియడ్స్ క్రమరహితంగా వస్తుంది. ముందస్తుగా రావడం లేదా ఆలస్యంగా రావడం జరుగుతుంది. కొన్ని చిట్కాలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


ఒత్తిడిని తగ్గించుకోవడానికి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.

చక్కని, సున్నితమైన సంగీతాన్ని వింటూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది.

ట్రావెలింగ్ కూడా ఒత్తిడిని దూరం చేసేందుకు సహకరిస్తుంది.

మీకు నచ్చిన పనులు చేయండి. ఫోటో గ్రఫీ, వంట, పెంపుడు కుక్కలతో ఆడడం వంటివి.

మీకు బాగా నచ్చినవారితో ఎక్కువ సమయం గడపండి.

పైన చెప్పిన చిట్కాలేవీ మీ ఒత్తిడిని తగ్గించకపోతే సైకియాట్రిస్టును కలవాలి.