టీ కప్పుతో పాటు చాలా మంది డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా పెట్టుకుని తింటారు. కానీ ఇవి అతిగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం.
ఆయిల్, మాల్ట్ ఎక్స్ ట్రాక్ట్, రైజింగ్ ఏజెంట్ వంటి పదార్థాలు డైజెస్టివ్ బిస్కెట్స్ లో ఉపయోగిస్తారు.
డైజెస్టివ్ బిస్కెట్స్ ఎక్కువగా గోధుమలతో తయారవుతాయి. వీటిలో ఇనులిన్ అధికంగా ఉంటుంది. మాల్ట్ సారం అధికంగా తీసుకున్నప్పుడు ఆపానవాయువుకు కారణమవుతుంది.
ఇందులో వాడే కూరగాయల నూనె ఉడికించినప్పుడు ట్రాన్స్ ఫ్యాట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఆరోగ్యానికి హానికరం.
కూరగాయల నూనె లైపోయిడ్ న్యుమోనియాకు కారణమవుతుంది. దీని వల్ల విపరీతమైన దగ్గు వస్తుంది.
డైజెస్టివ్ బిస్కెట్లు సోడియం బైకార్బోనెట్ లు ఉపయోగిస్తాయి. దీన్ని అతిగా తీసుకుంటే దాహం వేస్తుంది.
అధిక రక్తపోటు, గుండె వైఫల్యం లేదా మూత్రపిండాల వ్యాధి వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు డైజెస్టివ్ బిస్కెట్స్ తింటే దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి.
కడుపు తిమ్మిరి, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
పేరుకే డైజెస్టివ్ బిస్కెట్స్ ఆరోగ్యమని అంటారు. వీటిలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. అందుకే వీటిని అతిగా తినడం మంచిది కాదు.