వేసవిలో డెనిమ్స్‌తో ఫంగల్ ఇన్ఫెక్షన్లు డెనిమ్... ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్. మందంగా ఉంటుంది. దీంతో తయారు చేసిన జీన్స్ వేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. వీటిని మండే ఎండల్లో వేసుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని మండే ఎండల్లో వేసుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండల్లో జీన్స్ వేసుకున్న చోట చెమట పట్టినా, అది ఆరకుండా చేస్తుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ ఎలర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మండుతున్న ఉష్ణోగ్రతల మధ్య జీన్స్ వేసుకోకపోవడమే మంచిది. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల ఆ తడి ఆరిపోయే అవకాశం జీన్స్ లో ఉండదు. ఆ ప్రాంతంలో రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ ప్రాంతంలో దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే ఈ ఫంగస్ ప్రారంభం అవుతుందో, అక్కడ చర్మం రంగు మారిపోతుంది. పొరలు పొరలుగా ఊడిపోతుంది.