ప్రోటీన్ రిచ్ ఫుడ్ గురించి చెప్పేటప్పుడు అందరూ గుడ్లు గురించి మాట్లాడతారు.
కానీ గుడ్డులో కంటే ఇతర శాఖాహార ఆహారాల్లో కూడా ప్రోటీన్ అధికంగా లభిస్తుంది.


100 గ్రాముల గుడ్డులో 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.



యూఎస్డీఏ ప్రకారం 100 గ్రాముల సోయా బీన్ లో 36 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.
గుడ్డులో లభించే ప్రోటీన్ కంటే రెట్టింపు ఇందులో దొరుకుతుంది.


డైరీ ఉత్పత్తులు, ఆవు పాలకు సోయా పాలు మేలైన ఎంపిక.



శనగలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి.



100 గ్రాముల ఉడికించిన చిక్ పీస్ లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.



బుక్వీ ట్ పిండిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.



100 గ్రాముల బుక్వీట్ పిండిలో 13.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.



చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి.
అంతే కాదు ప్రోటీన్ తో నిండి ఉంటాయి.


100 గ్రాముల చియా విత్తనాల్లో 17 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది.



బరువు తగ్గించే ఆహారాల జాబితాలో ఒకటి క్వినోవా.
ఇందులో తొమ్మిది ముఖమైన అమైనో ఆమ్లాలు ఉన్నందున వీటిని పూర్తి ప్రోటీన్ గా పరిగణిస్తారు.


100 గ్రాముల క్వినోవా లో 16 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు.