లిప్ స్టిక్ వల్ల పెదాలు నల్లగా మారిపోతున్నాయా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు పెదాలని ఎక్స్ ఫోలియేట్ చేయడం వల్ల చర్మం కొంత గాలి పీల్చుకునేలా చేస్తుంది. మృతకణాలు, మురికిని తొలగిస్తుంది. వాటిని పోగొట్టేందుకు చక్కెర, కొబ్బరి నూనె పేస్ట్ మాదిరిగా చేసి పెదవులపై కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పొడి, పగుళ్లు పిగ్మెంటేషన్ కి కారణమవుతాయి. అందుకే పెదవులు మాయిశ్చరైజింగ్ కీలకం. బీస్ వాక్స్, షియా బటర్ లేదా కోకో బటర్ తో లిప్ బామ్ ను అప్లై చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లిప్ స్టిక్ అందంగా కనిపించేందుకు లి ప్రైమర్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. పెదవుల నుంచి రక్తస్రావం కాకుండా ఇది అడ్డుకుంటుంది. లిప్ స్టిక్ రాసుకునే ముందు పెదవులకు కొద్దిగా లిప్ ప్రైమార్ వేసుకుంటే మంచిది. జోజోబా ఆయిల్, విటమిన్ ఇ, బీస్వాక్ వంటి సహజ మూలకాలతో కూడిన లిప్ స్టిక్ లు ఉత్తమమైనవి. రాత్రంతా లిప్ స్టిక్ ఉంచడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. అందుకే పడుకునే ముందు లిప్ స్టిక్ శుభ్రం చేసుకోవాలి. లిప్ స్టిక్ తీసేసిన తర్వాత పెదాలు తేమగా ఉండాలంటే లిప్ బామ్ రాసుకోండి.