శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది లోపిస్తే ప్రమాదమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డి విటమిన్ లేకపోవడం వల్ల గాయాలు త్వరగా నయం కావు.

కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ డి లోపం స్త్రీలు, పురుషులలో వంధ్యత్వానికి దారి తీస్తుంది.

విటమిన్ డి లోపంతో బాధపడే స్త్రీలలో గర్భాశయ ఫైబ్రాయిడ్లు అండాశయాలు తగ్గడానికి కారణమవుతాయి.

పురుషులలో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.

విటమిన్ డి లోపం వల్ల కనిపించే ప్రధానమైన లక్షణాల్లో ఆందోళన, డిప్రెషన్ ఒకటి.

విటమిన్ డి లోపం అంటే శరీరంలో కాల్షియం తగినంతగా శోషించలేదని అర్థం.

ఫలితంగా దీర్ఘకాలిక కండరాల నొప్పి, కీళ్లలో నొప్పి, బోలు ఎముకల వ్యాధి ఏర్పడుతుంది.

విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంది.

ఒత్తిడి, ఆందోళన, నిరాశ, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం 65 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు.