పురుషులు గర్భనిరోధక మాత్రలు వాడవచ్చా? ప్రస్తుతం మహిళలకే గర్భనిరోధక మాత్రలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో పురుషులకు రాబోతున్నాయి. మగవారి కోసం తయారు చేస్తున్న గర్భనిరోధకం మాత్రలు వీర్యం ఉత్పత్తిని లేదా విడుదలను నిరోధించడం ద్వారా గర్భం రాకుండా అడ్డుకుంటాయి. పురుషులకు గర్భనిరోధక మాత్రలు అనగానే మొదట వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఏంటి అనే సందేహం వస్తుంది. వీటి వల్ల వారిలో లైంగికాసక్తి తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్ వస్తాయి. మొటిమలు, బరువు పెరగడం వంటివి జరుగుతాయి. గర్భనిరోధక మాత్రలను పురుషులు అధికంగా, దీర్ఘకాలికంగా వాడటం వల్ల వారి వీర్య కణాలపై, వాటి సంఖ్య పై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు నిపుణులు. ఈ మాత్రలు వీర్యం ఉత్పత్తిని, విడుదలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. దీర్ఘకాలంగా వీటిని వాడడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గవచ్చు. లేదా వాటిలోని చలనశీలతను తగ్గవచ్చు. దీనివల్ల సంతాన ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది.