పంచదారకు మీరు బానిసయ్యారా?



కొకైన్ డ్రగ్‌ను మించిన వ్యసనాన్ని కలిగించేది మన ఇంట్లో వాడే పంచదార.



తెలియకుండానే చక్కెరను ఇష్టపడడం, అది ఉంటేనే తినడం చేస్తూ ఉంటాము. దీనికి బానిసైన సంగతి కనీసం ఆ వ్యక్తికి కూడా తెలియదు.



చక్కెరకు అలవాటు పడితే బరువు పెరగడం, ఊబకాయం, అధిక రక్తపోటు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి.



చక్కెర అధికంగా తీసుకుంటే టైప్2 డయాబెటిస్, గుండెజబ్బులు, కాలేయంలో కొవ్వు చేరడం వంటి ప్రమాదాలు ఉన్నాయి.



చక్కెర తినడం వ్యసనంగా మారినా కూడా అది అసాధారణంగా అనిపించదు. బయట వారికి కనిపించదు.



వీలైనంత ఎక్కువ స్వీట్లు తినాలని కోరిక వారిలో ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు.



కేకులు, పంచదార పానీయాలు పొట్టలో వేస్తూనే ఉంటారు. అయినా సరే సంతృప్తి ఉండదు.



పంచదార వ్యసనాన్ని మానేందుకు ప్రయత్నించాలి.