By: Haritha | Updated at : 11 May 2023 09:46 AM (IST)
(Image credit: Pixabay)
డయాబెటిస్ ప్రపంచంలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతోంది. మన దేశంలో కూడా కొన్ని లక్షల మంది డయాబెటిస్ బారినపడి ఇబ్బంది పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగడమే మధుమేహం. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నా ప్రమాదమే, తక్కువగా ఉన్న ప్రమాదమే. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. డయాబెటిస్ వల్ల అతి మూత్ర విసర్జన, బరువు తగ్గడం, అలసట, దృష్టి మసకబారడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే మధుమేహం అదుపులో లేకపోతే గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. నాడీ వ్యవస్థ పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం చాలా అవసరం. దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన మూలిక బ్రహ్మీ.
బ్రహ్మీ లేదా బకోప మొన్నీరి. ఇది అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఆయుర్వేద మూలిక. ఆయుర్వేదంలో వాడే మ్యాజిక్ మూలికలలో ఇది ఒకటి. ఈ బ్రహ్మీ మౌలిక ఉష్ణ మండల వాతావరణంలోనే పెరుగుతుంది. నీటి అడుగున ఇది పెరుగుతుంది. అక్వేరియంలో ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉంటారు. ఈ ఔషధమూలికకు యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు ఉంటాయి. అంటే టైప్1, టైప్2 మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని వాడవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచే లక్షణాలు దీనిలో ఎక్కువ.
బ్రహ్మీ ఆకులను నేరుగా తినడం వల్ల రక్తంలో అధిక చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం వల్ల కలిగే లక్షణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు ఈ బ్రహ్మీ ఆకులు సహాయపడతాయి. బ్రహ్మీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. హానికర టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. శరీరంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనివల్ల గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. బ్రహ్మీ ఆకులను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. మూర్ఛ వంటివి తగ్గే అవకాశం ఉంది. మెదడు పనితీరును పెంచడంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలో బ్రహ్మీ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి.
ఎలా తీసుకోవాలి?
బ్రహ్మీ ఆకులతో తయారుచేసిన క్యాప్సుల్స్, సిరప్, పొడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏ రూపంలో తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా ఆయుర్వేద వైద్యులను కలిసి మీ సమస్యను చెప్పి దానికి తగ్గ బ్రాహ్మితో తయారు చేసిన మందులను కొనుక్కోవచ్చు. ఎంత మోతాదులో రోజుకు వేసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవాలి. నీటితో కలిపి తీసుకుంటే ఉత్తమంగా పనిచేస్తుంది.
Also read: మీకు ఇష్టమైన పండు ఏదో చెప్పండి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Diabetic Retinopathy: డయాబెటిక్ రెటినోపతితో కంటి చూపు పోతుందా? ఆయుర్వేదంతో కళ్లను కాపాడుకోవచ్చా?
Ayurvedam: ఫ్యాటీ లివర్ డీసీజ్‌ని నయం చేసే ఆయుర్వేద టీ- ఎలా తయారు చేయాలంటే
Ayurvedic Fruits: ఆయుర్వేదంలో ఔషధాలుగా పరిగణించే పండ్లు ఇవే- వీటిని తింటే బోలెడు ప్రయోజనాలు
Leftover Food: ఆయుర్వేదం ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో తెలుసా?
Ayurvedam Tips: జీర్ణక్రియను మెరుగుపరిచే ఐదు ఆయుర్వేద మార్గాలు ఇవిగో
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు