Ginger Garlic Soup : వింటర్లో అల్లం వెల్లుల్లి సూప్ తాగితే.. ఇమ్యూనిటీ వీర లెవల్లో వస్తుందట
Winter Immunity Boosting Foods : చలికాలంలో మీకు ఉదయాన్నే వెచ్చదనాన్ని ఇచ్చే, ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ కావాలనుకుంటే మీరు అల్లం వెల్లుల్లి సూప్ తాగవచ్చు.
Ginger Garlic Soup Recipe : రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం వెల్లుల్లి సూప్ చేసే మేలును మరచిపోలేము. ఈ ఘాటైన, సుగంధబరితమైన సూప్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా చలికాలంలో అత్యంత అవసరమైన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ హాట్, టేస్టీ సూప్‌ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? దానిని ఏవిధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి - 10 రెబ్బలు
అల్లం - అంగుళం
టమాట - 1
క్యారెట్ - 1
మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
పెప్పర్ - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం..
ముందుగా వెల్లుల్లి, అల్లంపై పొట్టు తీసి కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. టమాట, క్యారెట్‌ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మొక్కజొన్న పిండిలో నీరు పోసి.. ఉండలు లేకుండా కలుపుకుని పక్కపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై పాన్ ఉంచి నూనె వేయాలి. దానిలో అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు, క్యారెట్లు వేసి రెండు నిమిషాలు వేయించాలి. మీకు సూప్ ఎంత కావాలనుకుంటన్నారో అంత నీరు వేసి.. మరగనివ్వండి. నీరు మరిగిన తర్వాత దానిలో ఉప్పు, పెప్పర్ వేసి కలిపి మూతపెట్టి ఉడకనివ్వండి.
నీటితో కలుపుకున్న మరుగుతున్న మిశ్రమంలో వేయండి. ఇప్పుడు బాగా కలపండి. లేదంటే పిండి గడ్డకట్టుకుపోయే అవకాశముంది. దీనిని మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చే వరకు ఉడికించాలి. అంతే వేడి వేసి అల్లం, వెల్లుల్లి సూప్ రెడీ. సర్వ్ చేసుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోవడం మాత్రం మరచిపోకండి. దీనిని వేడిగా తీసుకుంటే మీకు రుచిగాను ఉంటుంది. అంతేకాకుండా గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ సూప్‌లో ఉల్లిపాయలు, బఠానీలు, మొక్కజొన్నలు, క్యాబేజీ, చికెన్ వంటివి కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చినవి వేసుకుని సూప్ రెడీ చేసుకోవచ్చు.
ఈ సూప్‌ను మీరు ఏ కాలంలో తీసుకున్నా మంచిదే. ముఖ్యంగా వింటర్లో ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులనుంచి ఉపశమనం అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది మూడ్‌ని వెంటనే రిఫ్రష్ చేసి.. ఒత్తిడినుంచి ఉపశమనం అందిస్తుంది. దీనిలోని ఔషద గుణాలు మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం అందిస్తాయి. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు కూడా దీనిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ డైట్లో చేర్చుకోవచ్చు.
Also Read : అమ్మాయిల కన్నీళ్లకు అబ్బాయిలను కంట్రోల్ చేసేంత పవర్ ఉందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.