Tattoo: టాటూ వేయించుకుంటున్నారా? అయితే వేయించుకోవడానికి ముందు, తరువాత ఈ పనులు చేయకూడదు

టాటూలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

FOLLOW US: 

టాటూ... గత కొన్నేళ్లుగా దూసుకెళ్తున్న ఒక ఫ్యాషన్ ట్రెండ్.  కాలేజీ అమ్మాయిలకు, అబ్బాయిలకు చాలా ఇష్టమైన ఫ్యాషన్ ఇది. అయితే టాటూ వేయించుకోవడానికి వెళ్లేముందు, వేయించుకుని వచ్చాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు చర్మ ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కొందరిలో ఇవి రియాక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. 

టాటూ వేయించుకోవడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవిగో...
1. టాటూ వేయించుకునే ముందు రోజు రాత్రి కెఫీన్ ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవద్దు. ఆల్కాహాల్ కి కూడా దూరంగా ఉండాలి. వాటిని తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. ఇలా పలుచగా మారడం వల్ల టాటూ వేసేటప్పుడు రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. 

2. టాటూ వేయించుకోవడానిక ఒక వారం రోజుల ముందు నుంచి నీళ్లు పుష్కలంగా తాగాలి. ప్రతి రోజూ రెండులీటర్లకు తగ్గకుండా తాగాలి. ఇలా చేయడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. టాటూ వేయించుకున్నాక చర్మంపై సైడ్ ఎఫెక్టులు కూడా తగ్గుతాయి. 

3. టాటూ వేయించుకునే ముందు టాటూఆర్టిస్టు కొత్త సూదులనే ఉపయోగిస్తున్నాడో లేదో నిర్ణారించుకోండి. వాడిన సూదల వల్ల రకరకాల వైరస్ లు ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తాయి. 

టాటూ వేయించుకున్నాక....
1. టాటూల ద్వారా చర్మ వ్యాధులు సులభంగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వేయించుకున్న వెంటనే దానిపై దుమ్మూ ధూళి పడకుండా బ్యాండేజ్ కట్టుకోవాలి. 

2. టాటూకు బ్యాండేజ్ కట్టిన కొన్ని గంటల తరువాత తీసి యాంటీ బాక్టిరియల్ సబ్బుతో శుభ్రం చేయాలి. టాటూను గోరువెచ్చని నీరు, మృదువైన టవల్‌తో తుడవాలి. గట్టిగా రుద్దకూడదు. 

3. టాటూ వేయించుకున్న తరువాత లోషన్, క్రీమ్ లేదా పెట్రోలియం జెల్లీని రాయాలి. కనీసం రెండు వారాల పాటూ ఇలా మాయిశ్చరైజర్ క్రీములను పూయాలి. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

Also read: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

Published at : 25 Jan 2022 10:40 AM (IST) Tags: Tattoo Pros and cons of tattoo Tattoo care టాటూ కేర్

సంబంధిత కథనాలు

Maida Making: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అన్ని రోగాలు

Maida Making: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అన్ని రోగాలు

Kids Height: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? రోజూ వారితో ఇవి తినిపించండి

Kids Height: మీ పిల్లలు ఎత్తు పెరగాలా? రోజూ వారితో ఇవి తినిపించండి

ఈ తారు రోడ్డు సువాసనలు వెదజల్లుతుంది, ఈ మార్గంలో వెళ్తే మైమరిచిపోతారు!

ఈ తారు రోడ్డు సువాసనలు వెదజల్లుతుంది, ఈ మార్గంలో వెళ్తే మైమరిచిపోతారు!

International Kissing Day: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?

International Kissing Day: ఇలా కిస్ చేస్తే గనేరియా వస్తుందా? ముద్దు ఆరోగ్యానికి మంచిదేనా?

Ayurvedam: చికెన్ తిన్న తర్వాత పాలు తాగకూడదా? ఆయుర్వేద నిపుణులు ఏం సూచిస్తున్నారు?

Ayurvedam: చికెన్ తిన్న తర్వాత పాలు తాగకూడదా? ఆయుర్వేద నిపుణులు ఏం సూచిస్తున్నారు?

టాప్ స్టోరీస్

Weather Updates: నేడు ఈ 6 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ - మిగతా చోట్ల ఎల్లో అలర్ట్

Weather Updates: నేడు ఈ 6 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ - మిగతా చోట్ల ఎల్లో అలర్ట్

Ilaiyaraaja-Vijayendraprasad: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పీటీ ఉష!

Ilaiyaraaja-Vijayendraprasad: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పీటీ ఉష!

YSRCP Plenary Schedule: రేపే వైసీపీ ప్లీన‌రీ, అధికారంలోకొచ్చాక తొలిసారి - మొదటిరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదీ

YSRCP Plenary Schedule: రేపే వైసీపీ ప్లీన‌రీ, అధికారంలోకొచ్చాక తొలిసారి - మొదటిరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదీ

Karimnagar Bear: కరీంనగర్‌లో మళ్ళీ ఎలుగుబంటి దడ! సవాలుగా మారిన సమస్య, అధికారులు ఉరుకులు పరుకులు

Karimnagar Bear: కరీంనగర్‌లో మళ్ళీ ఎలుగుబంటి దడ! సవాలుగా మారిన సమస్య, అధికారులు ఉరుకులు పరుకులు