అన్వేషించండి

Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త... ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించే సత్తా కాఫీకే ఉంది, వెల్లడించిన కొత్త అధ్యయనం

కాఫీ ప్రియులకు ఇది శుభవార్తే. కాఫీ తాగడం వల్ల మరో భయంకరమైన ఆరోగ్య సమస్య నుంచి బయటపడొచ్చు.

ప్రపంచంలో కాఫీ అభిమానుల సంఖ్యే ఎక్కువే. వారందరకీ ఓ కొత్త అధ్యయనం శుభవార్తను మోసుకొచ్చింది. రోజూ కాఫీ తాగే వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగని అన్ని రకాల క్యాన్సర్లు అనుకోకండి. గర్భాశయ పొరపై వచ్చే క్యాన్సర్, దీన్నే ‘ఎండోమెట్రియల్ క్యాన్సర్’ అంటారు. మహిళల్లో ఇది వస్తుంది. కాఫీని క్రమం తప్పకుండా తీసుకునే ఆడవారిలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని తేలింది. దానితో పాటు, కెఫీన్ లేని కాఫీ కంటే కెఫీన్ ఉన్న కాఫీనే ఈ విషయంలో ఉత్తమ రక్షణను అందిస్తుందని కూడా చెబుతున్నారు పరిశోధకులు. ఈ అధ్యయనం తాలుకు వివరాలు ‘జర్నల్ ఆప్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ రీసెర్చ్’లో ప్రచురించారు. ఈ అధ్యయనం కోసం భారీ ఎత్తునే పరిశోధన జరిగింది. 

మొత్తం 6,99,234 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు.  వీరిలో రోజూ కాఫీ తాగే వారిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశం 29 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీరిలో కాఫీ తాగే అలవాటు లేనివారిలో 9000 మందికి పైగా ఈ క్యాన్సర్ బారిన పడినట్టు కనుగొన్నారు. అయితే కాఫీ క్యాన్సర్ రాకుండా ఎలా అడ్డుకుంటుందో తెలుసుకోవడానికి మాత్రం ఇంకా లోతెైన పరిశోధనలు అవసరమని తేల్చారు. వాటి మధ్య అనుబంధం ఉందన్నది వాస్తవం, కానీ ఆ అనుబంధం ఎలా ఏర్పడిందన్నది తెలుసుకోవాలంటే మాత్రం కాస్త సమయం పడుతుందని అని చెబుతున్నారు.  

కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో చేరిన వెంటనే తక్షణ శక్తిని ఇస్తుంది. చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే కాఫీని ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడతారు. అయితే కాఫీ రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. శరీరంలో మోతాదుకు మించి కెఫీన్ చేరినా కూడా ప్రమాదమే. 

కాఫీ మితంగా తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా గతంలోనే బయటపడ్డాయి. పంచదార వేయని కాఫీ తాగితే డయాబెటిస్ రోగులుకు చాలా మంచిది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ముప్పును కూడా 25శాతం తగ్గిస్తుంది. అందుకే రోజూ కాఫీ తాగమని సిఫారసు చేస్తున్నాయి కొన్ని అధ్యయనాలు అయితే రోజుకు రెండు కప్పులకు మించి మాత్రం తాగవద్దని చెబుతున్నాయి. 

Also read: గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు పాటించాల్సిందే

Also Read: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Lung Cancer : స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
New Maruti Suzuki Swift: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ లాంచ్ డేట్ ఫిక్స్ - వచ్చే నెలలో ఎప్పుడంటే?
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ లాంచ్ డేట్ ఫిక్స్ - వచ్చే నెలలో ఎప్పుడంటే?
Embed widget